టీడీపీ కి సాధ్యం కానిది జనసేనకు సరిపడుతుందా.?

Can Jana Sena Survive Telangana Politics?

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ పార్టీ కూడా తెలంగాణలో రాజకీయంగా ముందుకు అడుగులేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. కేంద్రంలో మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ సైతం తెలంగాణలో ఆశించిన స్థాయిలో రాజకీయంగా రాణించలేకపోతుంది.

ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో అసలు పార్టీ తరుపున సరైన గుర్తింపు ఉన్న నాయకుడు కూడా లేని జనసేన తెలంగాణలో రాజకీయంగా అడుగులేసేందుకు సిద్దమయ్యింది. తెలంగాణలో త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుంది అంటూ టి. జనసేన ప్రకటన చేసింది.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో జనసేన ప్రభావం ఉంటుందా.? ఒకవేళ అటువంటి ప్రభావమే ఉంటే తెలంగాణలో రాజకీయంగా ఎదగాలని అనుకున్న బీజేపీ జనసేనను వదులుకుతుందా.? వద్దనుకుంటుందా.? ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన ఇప్పటికి ఆంధ్రాలో జనసేన బలం ను పెంచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయింది.

ఒకపక్క రాజకీయాలు, మంత్రి పదవి బాధ్యతలు, మరోపక్క సినిమాలు అంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మొత్తం అటు సినిమాలకి ఇటు ఏపీ రాజకీయాలకు మధ్య నలిగిపోతుంది. అటువంటి తరుణంలో ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కూడా జనసేన రాజకీయం మొదలు పెట్టాలనుకుంటే దానివల్ల జనసేనకు వచ్చే అదనపు ప్రయోజనాలకన్నా, అదనపు ఒత్తిడే అధికమవుతుంది.

ఇటు ఏపీ తో పాటుగా అటు తెలంగాణలో సైతం పవన్ రాజకీయంగా ప్రత్యర్థులను తయారు చేసుకున్నట్టే అని చెప్పాలి. అసలు పవన్ వద్ద తెలంగాణలో పార్టీ బలోపేతానికి సరిపడా సమయం ఉందా.? గతంలో కూడా ఇదే మాదిరి తెలంగాణలో కూడా జనసేన పోటీ అంటూ బరిలో దిగి పరువు పోగొట్టుకున్నారు.

ఆ సమయంలో అసలు పార్టీ ఎన్నిక ప్రచారానికి కూడా పవన్ వద్ద సమయం లేకుండా పోయింది. తన పార్టీ తరుపున పోటీ చేసిన నేతల కోసం పవన్ కనీసం ఒక వీడియో బైట్ కూడా ఇవ్వలేకపోయారు. అటువంటి పరిస్థితులలో పవన్ కు ఇప్పుడు ఇది మోయలేని భారమే అవుతుంది.

ఇప్పటికే అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న పవన్ ఇక ఇపుడు కొత్తగా తెలంగాణ రాజకీయాలలో కూడా వేలు పెడితే ఆ మూడు స్తంభాలాట జనసేన బలోపేతానికి కాదు బలిహీనతను బయటపెడుతోంది. కోరుండి తెచ్చుకున్న కుంపటిలా మారుతుంది.

ADVERTISEMENT
Latest Stories