జనసేన, వైసీపీ ని మరిపించగలదా.?

Janasena Party

విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అడుగు పెట్టిన వైసీపీ, జనసేన రెండు పార్టీలు కూడా గత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏపీ ప్రజలను పలకరించాయి. అయితే ఇందులో వైస్ జగన్ స్థాపించిన వైసీపీ తన తండ్రి, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పార్టీకి పెట్టుబడిగా పెట్టి తన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి, తండ్రి చావు మీద వైసీపీ కి పునాదులు వేసుకున్నారు.

ఇక జనసేన విషయానికి వస్తే తన అన్న మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఫెయిల్యూర్ స్టోరీ గా మిగిలిన ప్రజారాజ్యం పార్టీ బాగేజ్ ను మోస్తూ జనసేనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే జనసేన పార్టీకి పెట్టుబడి, పునాది అన్ని పవన్ కళ్యాణ్ సినీ ఛరిష్మా, ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే.

ADVERTISEMENT

అయితే ఈ రెండు పార్టీల రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే వైసీపీ ఒంటరిగా మూడు సార్లు ఎన్నికలలో తడపడి 151 సీట్లతో ఒక సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, జనసేన రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచి ఓసారి 1 సీటుతో సరిపెట్టుకుని, 2024 టీడీపీ కూటమి మద్దతుతో 100 % స్ట్రైక్ రేట్ తో మంచి సక్సెస్ ను చూసింది.

అయితే ప్రస్తుతం ఏపీ లో ఈ రెండు రాజకీయ పార్టీల పరిస్థితి చూసుకుంటే వైసీపీ 151 నుంచి 11 కి పడి రాజకీయంగా ఢీలా పడగా, జనసేన 1 నుంచి 21 వచ్చి మంచి జోష్ లో ఉంటూ ప్రభుత్వంలో భాగమయ్యింది. దానికి తోడు గత ఐదేళ్ల వైసీపీ అవినీతి, అక్రమాలు ఆ పార్టీ నాయకులను కేసుల రూపంలో వెంటాడుతున్నాయి.

ఇక వచ్చిన 11 సీట్లతో అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా కూడా దక్కక, తమ నాయకుడికి, తమ పార్టీకి హోదా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్న వైసీపీ స్థానంలోకి జనసేన చేరుకోగలిగితే ఇక ఏపీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్ధకం లో పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరి జనసేన ఆ దిశగా అడుగులు వేస్తుందా.? జనసైనికులు వేయనిస్తారా.?

నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ తనతో పాటుగా తన పార్టీని బలోపేతం చేసుకోవడం, తన పార్టీ నాయకులను ప్రజలలోకి తీసుకెళ్లడం చేయగలగాలి. కానీ పవన్ ప్రజల మధ్యకు రాగానే ఆయన్ను చూడడానికి ఎగబడే ఆయన అభిమాన బలమే ఒక్కో సారి ఆయన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది.

పాదయాత్రలతో ప్రజలలో మమేకమైన జగన్, లోకేష్ భవిష్యత్ రాజకీయ నాయకుడిగా ప్రజల మెప్పుని పొందగలిగారు. కానీ పవన్ కు ఆ అవకాశం ఆయన అభిమానులు కల్పిస్తారా.? పవన్ కూడా అందుకు ముందుకొస్తారా.? అంటే సందేహమే. మాకంత సత్తా లేదు అంటూ ఒకసారి, మాకు మాత్రమే సాధ్యమయ్యింది అంటూ మరోసారి ఇలా ఒక నిర్దిష్ట అభిప్రాయం లేకుండా తానూ తడబడుతూ తన పార్టీ క్యాడర్ ను అయోమయంలో పెడుతున్నారు పవన్.

ఇక అనవసర విషయాలలో బీజేపీ భుజం కాస్తూ లేనిపోని వివాదాలను తన మెడకు చుట్టుకుంటూ తన పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతున్నారు పవన్. కూటమి పొత్తులో భాగంగా 21 సీట్లతో ఏపీలో రెండవ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జనసేన ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేయగలగాలి. ఆ దిశగా ఒక్కో అడుగు జనసేన ముందుకు వేయగలిగితే వైసీపీ ని వెనక్కి నెట్టినట్టే అవుతుంది.

పవన్ తనకున్న సినీ ఛరిష్మాను, రాజకీయ ఇమేజ్ గా మార్చుకుని, ఒక మాస్ నాయకుడిగా ప్రజలకు చేరువ కాగలిగితే పవన్ అనుకున్న వైసీపీ లేని ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు.

ADVERTISEMENT
Latest Stories