నాన్చుడు కాదు బాబు గారు…. ఇది దంచుడు

Chandrababu-Naidu-Scoring-Political-Self-Goal-For-No-Reasonసమన్వయం, వేచిచూసే ధోరణి, వ్యూహాత్మక మౌనం, పేరు ఏదైనా సరే ముఖమంత్రి చంద్రబాబు నాయుడు చేసేది మాత్రం నాన్చుడు నమ్ముకున్న పార్టీ వారిని దంచుడు. అమరావతి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా నాలుగు గంటల పాటు సుధీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, కేంద్రం చేస్తున్న మోసం, ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వివరంగా ప్రసంగించారు.

మరోవైపు నిన్నటినుండి వివిధ ప్రసారమాధ్యమాలలో చంద్రబాబు అసెంబ్లీలో ఎన్డీయే నుండి బయటకు వస్తున్నట్టు ప్రకటన చేస్తారని, కనీసం కేంద్ర కేబినెట్ నుండి తమ మంత్రులను ఉపసంహరిస్తారని పుకార్లు షికార్లు చేసాయి. అయితే చంద్రబాబు మాత్రం కేంద్రాన్ని మరింత బ్రతిమాలటం, మరింత విజ్ఞప్తులు చేయడంతోనే సరిపెట్టారు.

ADVERTISEMENT

నిన్న జరిగిన టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు అధినేతకు బీజేపీతో దోస్తీ మనకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటింగు పెట్టగా ఆరుగురు తప్ప మిగతావారంతా విడాకులకే ఓటు వేశారు, అయితే చంద్రబాబు మాత్రం ఆ దిశగా ముందడుగు వేయలేకపోయారు. దీనితో తెలుగు దేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

మరోవైపు ఇప్పటికిప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికలలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు పడవని చంద్రబాబు వెనక్కు తాగారేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కారణం ఏదైనా ఈ ధోరణి తెలుగు దేశం పార్టీకి ఇబ్బందికరంగా సంభవించే అవకాశం కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories