బాబు పై కేటీఆర్ పొగడ్తలు….వైసీపీ కి అర్ధమవుతుందా.?

KTR Praises Chandrababu Naidu as YSRCP Targets TDP Govt

సీఎం గా చంద్రబాబు నాయుడు ఫెయిల్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు సాగు నీటి నుంచి ప్రజలకు తాగు నీటి వరకు అన్ని ఇబ్బందులే, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి లేదు, సంక్షేమ పథకాల పంపిణి లేదు, కేవలం క్రెడిట్ చోరీ, దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే అంటూ వైసీపీ టీడీపీ ని ముఖ్యంగా బాబు ని టార్గెట్ చేస్తుంది.

ఇటువంటి పరిస్థితులలో వైసీపీ ఆత్మబంధువైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాబు నాయకత్వ లక్షణాలను, ఆయన పాలనా విజనరీ ని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ తో పోలిస్తే ఏపీలో వర్షపాతం తక్కువ శాతం లో పడింది. కానీ అక్కడ ఎక్కడ సీఎం బాబు రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు.

ADVERTISEMENT

ఏపీలో వర్షాభావం సరైన స్థాయిలో లేకపోయినప్పటికీ బాబు కృష్ణ, గోదావరి నీటిని ఎత్తిపోసుకుంటూ రైతులకు అవసరమైన సాగు నీటిని అందిస్తున్నారు. దీనితో ఏపీలో కరువు సంభవించలేదు, ఈ విషయంలో నేను బాబు ని అభినందిస్తున్నా అంటూ బాబు పై ప్రశంసలు కురిపించారు.

అలాగే బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ సైతం కేటీఆర్ వ్యాఖ్యలను బలపరుస్తూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే టీడీపీ పార్టీకి, బాబు కి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వైసీపీ కి మిత్రపక్షంగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలే ఇలా బాబు పై ప్రశంసలు కురిపించడం,

ఆయన ముందు చూపుతో ఏపీలో కరువు పరిస్థితులు తలెత్తకుండా కృష్ణ, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటున్నారని, తద్వారా రాష్ట్రంలో క్రాప్ హాలిడే రాలేదని, నీటి కరువు తలెత్తలేదంటూ బహిరంగ ప్రకటనలు చేయడం ఒకరకంగా వైసీపీ నోటికి తాళం వేసినట్టే అవుతుంది.

తమ పార్టీకి మిత్రపక్షంగా ఉంటూ జగన్ 2.0 కోసం తెరవెనుక రాజకీయం నడిపిన బిఆర్ఎస్ నేతలే ఇలా బాబు పాలన పై ప్రశంసలు కురిపిస్తుండడంతో ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిబద్దతతో వ్యవహరిస్తుందో, వారి అవసరాలకు అవసరమైన సాగు నీటి కోసం ఎంతలా శ్రమిస్తుందో వైసీపీ శ్రేణులకు ఇప్పటికైనా అర్ధమవుతుందో లేదో.?

ADVERTISEMENT
Latest Stories