బాబు కౌంటర్లు…రహస్య యూనివర్సిటీ లో రహస్య డిగ్రీ అట..!

Chandrababu Naidu

నాయుడు పేట లో టీడీపీ నిర్వహించిన ప్రజాగళంలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న తన వయస్సు, చదువు పై జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. నేను చదువుకున్నది వెంకటేశ్వర యూనివర్సిటీ. నా క్యాలిఫికేషన్ MA ఎకనామిక్స్.

జగన్ నువ్వు ఎక్కడ చదివావు…నీ క్యాలిఫికేషన్ ఏంటి..? అంటూ ప్రశ్నిస్తూనే, జగన్ ఒక రహస్య యూనివర్సిటీలో ఒక రహస్య డిగ్రీ పూర్తి చేసాడు తమ్ముళ్ళు అదంతా కూడా ఒక రహస్యమే, ఇటువంటి ఫేక్ ఫెలౌస్ నా గురించి మాట్లాడితే బాధేస్తుంది అంటూ జగన్ కు కౌంటర్ వేశారు బాబు.

ADVERTISEMENT

గతంలో కూడా జగన్ తన విద్యా అర్హత పై అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. పదోతరగతిలో ప్రశ్నాపత్రాల వివాదం మీద జగన్ పై అసెంబ్లీ లో రచ్చ జరిగిన తీరును ఓ సారి గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ క్యాడర్. నేను 10 లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ జగన్ చేసిన ప్రసంగాన్ని…ఇప్పుడు జగన్ ప్రసంగాలలో దొర్లే తప్పిదాలను బేరీజు వేస్తూ అవును జగన్ తెలుగు భాషను కూని చేయడంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.

ఇలా అనవరసమైన విషయాలను కదిపి తన పరువు తానే తీసుకున్నట్లుగా జగన్ ప్రసంగాలు సాగుతున్నాయి. మొన్న అవినాష్ రెడ్డి ని పక్కన పెట్టుకుని వివేకా హత్య గురించి, నేడు బాబు విద్యార్హత గురించి మాట్లాడి తన డొల్లతనాన్ని ప్రజలలో చర్చకు తెచ్చారు జగన్. అలాగే తన వయస్సు గురించి మాట్లాడిన జగన్ కు తన మాదిరే రెండు గంటల పాటు ఎండలో సభలు నిర్వహించగలరా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు బాబు.

బాబాయ్ గొడ్డలి వేటు…కోడి కత్తి డ్రామా చూసిన మీఅందరికి ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ కంటైనర్ల డ్రామా కూడా కనపడుతుందా..? ఈ ఐదేళ్లలో ఇసుక, మద్యం నుండి అక్రమంగా కూడకట్టుకుందంతా ఇప్పుడు కంటైనర్లలో నింపి ఒక్కో నియోజకవర్గానికి డోర్ డెలివరీ చేసున్నాడు ఈ ప్యాలస్ ముఖ్యమంత్రి. ఎక్కడిక్కడ స్టాక్ నిలువలు చేసుకుని విచ్చలవిడి గా డబ్బు, మద్యం పంపిణీకి శ్రీకారం చుడుతోంది వైసీపీ అంటూ వైసీపీ అక్రమ సంపాదన పంపణీ గుట్టు రట్టు చేస్తున్నారు బాబు.

ADVERTISEMENT
Latest Stories