చంద్రబాబు కుటుంబ ఆస్తుల పూర్తి వివరాలు… షాక్ అవుతారా..?!

Chandrababu Naidu Family Assets Announcedటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గుంటూరులో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… వరుసగా ఎనిమిదో సంవ‌త్స‌రం త‌మ కుటుంబ ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డిస్తున్నామ‌ని తెలిపారు. నారా లోకేశ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…

చంద్ర‌బాబు నాయుడు ఆస్తుల వివ‌రాలు…
* హైద‌రాబాద్‌లోని నివాసం విలువ 3 కోట్ల 68 ల‌క్ష‌లు
* చంద్ర‌బాబు అంబాసిడ‌ర్ కారు ఒక ల‌క్షా 52 వేలు
* చంద్ర‌బాబు ఖాతాలోని న‌గ‌దు 3 ల‌క్ష‌ల 59 వేలు
* చంద్ర‌బాబు మొత్తం ఆస్తులు 3 కోట్ల 73 ల‌క్ష‌లు
* చంద్ర‌బాబు పేరిట బ్యాంకు రుణం 3 కోట్ల 6 ల‌క్ష‌లు
* చంద్ర‌బాబు నిక‌ర ఆస్తులు 6 కోట్ల 7 ల‌క్ష‌లు

ADVERTISEMENT

నారా భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న ఆస్తుల వివ‌రాలు…
* పంజాగుట్ట‌లో ఉన్న స్థ‌లం విలువ 73 ల‌క్ష‌లు
* త‌మిళ‌నాడులోని భూమి విలువ ఒక కోటి 86 ల‌క్ష‌లు
* మ‌దీనాగూడ‌లోని భూమి విలువ 73 ల‌క్ష‌లు
* హెరిటేజ్ ఫుడ్‌లో భువ‌నేశ్వ‌రి వాటాల విలువ 19 కోట్ల 95 లక్ష‌లు
* వివిధ కంపెనీల్లోని భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న వాటాల విలువ 3 కోట్ల 28 ల‌క్ష‌లు
* భువ‌నేశ్వ‌రి పీఎఫ్ ఖాతా నిలువ ఒక కోటి 73 ల‌క్ష‌లు
* బంగారు ఆభ‌ర‌ణాల విలువ కోటి 27 ల‌క్ష‌లు
* కారు విలువ 91 ల‌క్ష‌లు
* భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు 38 కోట్ల 66 ల‌క్ష‌లు
* అప్పులు 13 కోట్లు
* నిక‌ర ఆస్తులు 24 కోట్ల 84 ల‌క్ష‌లు

నారా లోకేశ్‌ ఆస్తుల వివ‌రాలు…
* హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ 2 కోట్ల 52 ల‌క్ష‌లు
* ఇత‌ర కంపెనీల్లోని వాటాల విలువ ఒక కోటి 64 ల‌క్ష‌లు
* నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ 92 లక్ష‌లు
* మొత్తం ఆస్తుల విలువ 14 కోట్ల 50 ల‌క్ష‌లు
* అప్పుల విలువ 6 కోట్ల 35 ల‌క్ష‌లు
* నిక‌ర ఆస్తుల విలువ 8 కోట్ల 15 ల‌క్ష‌లు

నారా బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు…
* మాదాపూర్‌లో బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న భూమి విలువ 17 ల‌క్ష‌లు
* జూబ్లిహిల్స్‌లో బ్రాహ్మ‌ణి పేరిట వున్నా ఇంటి విలువ 3 కోట్ల 50 ల‌క్ష‌లు
* హైద‌రాబాద్ లో ఉన్న వాణిజ్య స్థ‌లం విలువ 48 ల‌క్ష‌లు
* మ‌ణికొండ‌లో ఉన్న స్థ‌లం విలువ ఒక కోటి 23 ల‌క్ష‌లు
* హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల విలువ 78 ల‌క్ష‌లు
* ఆభ‌ర‌ణాల విలువ 15 ల‌క్ష‌లు
* పీఎఫ్ ఖాతా విలువ 19ల‌క్ష‌లు
* ఖాతాలోని న‌గ‌దు నిల్వ 25 ల‌క్ష‌లు
* బ్రాహ్మ‌ణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు 12 కోట్ల 75 ల‌క్ష‌లు
* అప్పులు 42 ల‌క్ష‌లు
* నిక‌ర ఆస్తులు 12 కోట్ల 33ల‌క్ష‌లు

నారా దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలు…
* జూబ్లిహిల్స్‌ లోని దేవాన్ష్ పేరిట ఉన్న ఇంటి విలువ 9 కోట్ల 17 ల‌క్ష‌లు
* ఫిక్స్డ్ డిపాజిట్లు 2 కోట్ల 4 ల‌క్ష‌లు
* దేవాన్ష్ ఖాతాలోని న‌గ‌దు నిల్వ 2 ల‌క్ష‌ల 31 వేలు
* దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ 11 కోట్ల 32 ల‌క్ష‌లు

ADVERTISEMENT
Latest Stories