చంద్రబాబు, పవన్ శాసనసభలోకి… జగన్‌ బయటకు: దేవుడి స్క్రిప్ట్ కదా?

chandrababu-naidu-pawan-kalyan-ap-assembly

రాజకీయ నాయకులు సవాలు, శపధాలు చేయడం కొత్తకాదు. 2019లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాసనసభలో జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎమ్మెల్యేలు ఆయనను దారుణంగా అవమానించడంతో మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపధం చేసి బయటకు వచ్చేశారు.

ADVERTISEMENT

టిడిపి చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్న ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అటువంటి శపధం చేయడం చాలా సాహసమే అని చెప్పవచ్చు.

టిడిపి ఎన్నటికీ అధికారంలోకి రాదని, తాను ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేనని చంద్రబాబు నాయుడు గ్రహించారు కనుకనే ఇలాంటి శపధం చేసి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారంటూ జగన్‌, వైసీపి నేతలు ఆయనను చాలా అవహేళన చేశారు.

చంద్రబాబు నాయుడు శపధంతో ఆయన పనైపోయిందని నిర్ధారించేసిన జగన్మోహన్‌ రెడ్డి, ఆ తర్వాత కూడా ఆయనను చూసి తీవ్ర ఆందోళనకు గురవుతుండేవారు.

ఆనాడు హిరణ్యకశిపుడు శ్రీహరిని ద్వేషిస్తూ నిత్యం శ్రీహరిని ఎలా తలచుకునేవాడో, జగన్‌ కూడా అదేవిదంగా రేయింబవళ్లు చంద్రబాబు నాయుడు పేరునే స్మరిస్తుండేవారు. ఆయన గురించే ఆలోచిస్తుందేవారు. ఆ భయం, దురాలోచనలో నుంచి పుట్టిన ఐడియాయే స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపడం.

తన పాలన అద్భుతంగా ఉందని, సంక్షేమ పధకాల పెట్టుబడితో తమ పార్టీకి 175 సీట్లు వస్తాయని, చంద్రబాబు నాయుడు శపధం నెరవేర్చుకోలేక రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని జగన్‌ నిజంగా నమ్మిన్నట్లయితే చంద్రబాబు నాయుడుని అసలు పట్టించుకునేవారే కాదు. కానీ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు వలన తాను అధికారం కోల్పోతాననే భయం జగన్‌కు ఉందన్న మాట!

ఆనాడు కంసుడు కూడా ఇలాగే భయపడి వసుదేవుడు, దేవకీదేవిని కారాగారంలో బందించి వారికి పుట్టిన బిడ్డలను చంపేస్తూ ఇక తనకు తిరుగు ఉండదని భ్రమలో విర్రవీగేవాడు. కానీ వారి కడుపునే పుట్టిన శ్రీకృష్ణుడు చేతిలో కంసుడు చనిపోయాడు. జగన్‌ విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగిందని చెప్పవచ్చు.

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఆయన భయపడిపోతారని, టిడిపి నిర్వీర్యం అయిపోయి తమకు అడ్డు తొలగిపోతుందని జగన్‌ అనుకున్నారు.

ఆనాడు వాసుదేవుడి సంకెళ్ళు తెగిపోయి, యమునా నది రెండుగా చీలి ఆయనకు దారివ్వగా అనంతనాగు ఆయన తలపై ఉన్న శ్రీకృష్ణుడికి పడగ పట్టింది.

అదేవిదంగా చంద్రబాబు నాయుడు చెరసాలలో ఉన్నప్పుడు అనంతనాగులా పవన్‌ కళ్యాణ్‌ వచ్చి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటపడి ఇద్దరూ కృష్ణార్జునులలా ప్రజల మద్యకు వచ్చారు. వారికి ప్రజలు నీరాజనాలు పలికి ఎన్నికలలో గెలిపించారు.

శిశుపాలుడి వంద తప్పులు పూర్తవగానే శ్రీకృష్ణుడు చేతిలో హతమైన్నట్లే, దుర్యోధనుడు వంటి జగన్మోహన్‌ రెడ్డి, ఆయనతో కలిసి అకృత్యాలు చేసిన వైసీపి కౌరవులు అందరూ కృష్ణార్జునుల వంటి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ చేతిలో తుడిచిపెట్టుకుపోయారు.

నాడు చంద్రబాబు నాయుడు శపధం చేసిన్నట్లే నేడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కళ్యాణ్‌, మూడు పార్టీల ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు.

వారిని తుడిచిపెట్టేయాలని కుట్రలు, కుతంత్రాలు చేసిన జగన్‌, వైసీపి ఎమ్మెల్యేల కళ్లెదుటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు చేశారు.

ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపధం చేసిన చంద్రబాబు నాయుడు దానిని నెరవేర్చుకొని శాసనసభలో అడుగుపెట్టగా, మరో 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని గొప్పలు చెప్పుకున్న జగన్‌ ప్రమాణ స్వీకారాల తర్వాత మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టక పోవచ్చు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా?

ADVERTISEMENT
Latest Stories