ప్రతిపక్ష అధినేత జగన్ మోహన్ రెడ్డికి టిడిపి వర్గీయులు ‘స్వీట్’ షాకిచ్చారు. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వైసీపీ – టిడిపి వర్గాలు నవ్వులు చిందించారు. దీనంతటికి వేదిక అయ్యింది ఏపీ అసెంబ్లీ. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సహా స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర అధికార పార్టీ సభ్యులు జగన్ కు కరచాలనం అందించారు. ఈ అరుదైన దృశ్యంతో వైసీపీ వర్గాలు షాక్ అయ్యాయి.
ఎప్పుడూ ఒకరి మీద ఒకరు వాగ్వివాదాలు చేసుకుంటూ వార్తల్లో నిలిచే వైకాపా, టిడిపి నేతలు ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కరచాలనం చేసుకోవడం చూసి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యంగా అసెంబ్లీలో జగన్ అభ్యంతరకమైన రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేసిన టిడిపి వర్గేయులే చొరవ తీసుకుని జగన్ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం, అధికార పార్టీ తీరుకు అద్దం పడుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తునారు.





