నిజమే! చెవిరెడ్డిని ఆ భగవంతుడే కాపాడాలి!

Chevireddy Liquor Scam

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికింఛి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను భగవంతుడినే నమ్ముకున్నానని కనుక ఆయనే తనని కాపాడుతాడని చెప్పుకుంటున్నారు.

ఆయన మాటలు, డ్రామాలు చూస్తున్న ఎవరికైనా “అయ్యో పాపం! ఇలాంటి గొప్ప దైవ భక్తుడుకి కూడా కష్టాలు తప్పలేదే” అని జాలిపడుతున్నారు. కానీ చెవిరెడ్డి ఆస్కార్ అవార్డ్ సాధించగల గొప్ప నటుడని మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో స్పష్టం చేసింది.

ADVERTISEMENT

మద్యం కుంభకోణం కేసులో ఆయన ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్‌ అయ్యారు. అతను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఓ గదిలో బల్లపై పేర్చిన నోట్ల కట్టలని లెక్కిస్తూ, అట్టపెట్టెలలో సర్ధించి పంపిణీకి రెడీ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గమ్మతైన విషయం ఏమిటంటే, దానిని ఎవరో రహస్యంగా చిత్రీకరించలేదు… వెంకటేష్ నాయుడు స్వయంగా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయించుకున్నారు. కసిరెడ్డి రాజ్ నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆ డబ్బు కట్టలు చెప్పిన వారికి పంపేందుకు సిద్దం చేసిన్నట్లు ‘సాక్ష్యం కోసం’ దానిని తన ఫోన్‌లో రికార్డ్ చేయించుకున్నారు. ఆ డబ్బు పంపిణీ అయిన తర్వాత దానిని చెరిపేశారు.

రెండు మూడు నెలల క్రితం వెంకటేష్ నాయుడు విదేశాలకు పారిపోతుండగా ఏపీ పోలీసులు అతనిని శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేసి విజయవాడ తీసుకువచ్చారు. అప్పుడే అతని ఫోన్‌ స్వాధీనం చేసుకొని దానిలో డేటా రికవరీ చేయగా ఈ వీడియో బయటపడింది.

వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలను లెక్కిస్తూ దొరికిపోయాడు కనుక ఈ కేసుతో తనకు సంబంధం లేదనే చెవిరెడ్డి వాదనలు, ఏడుపులు కేవలం డ్రామా అని తేలిపోయింది.

మద్యం కుంభకోణం కేసులో రూ.3,500 కోట్లు అవినీతి జరిగిందని సిట్ అధికారులు చెపుతున్నప్పటికీ, నోట్ల కట్టలు కాదు…. నోట్ల కట్టలలతో నిండిన గదులు… చూస్తుంటే సిట్ అధికారుల అంచనాలకు మించే అవినీతి జరిగినట్లు స్పష్టమవుతోంది.

కానీ కేసు కోర్టు విచారణలో ఉన్నప్పుడు ఇటువంటి కీలక సాక్ష్యాధారాలు మీడియాలో ప్రత్యక్షమవుతుంటే, సరిగ్గా ఇదే కారణంగా న్యాయస్థానం కేసుని కొట్టివేసే అవకాశం ఉందనే సంగతి మరిచిపోకూడదు.

ADVERTISEMENT
Latest Stories