ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమై అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుకు సరైన గుర్తింపు లభించినట్లయ్యింది. ఏపీ విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుసరిస్తున్న ముందుచూపు, ప్రతిభ, పరిపాలనా దక్షత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రముఖ చికాగో విశ్వవిద్యాలయం “గౌరవ డాక్టరేట్”ను ప్రకటించింది. తొలిసారిగా ఓ విదేశీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సదరు చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించడం విశేషం. దీంతో ఏపీ సిఎం మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు.
ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల టిడిపి వర్గాలు హర్షం వ్యక్తం చేసారు. అభివృద్ధి విషయంలో చంద్రబాబు విధానాలు అంతర్జాతీయంగా ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయో ఈ సందర్భంగా మరోసారి రుజువయ్యిందని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT





