ఇట్స్ అఫీషియల్… మెగాస్టార్ ప్రకటన..!

Chiranjeevi about vijay deverakonda stamina“గీత గోవిందం” సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయారు…. ఇది విజయ్ అభిమానుల మాట కాదు, సినీ విశ్లేషకుల వ్యాఖ్యలు అంతకంటే కాదు. విజయ్ స్టామినా గురించి టాలీవుడ్ మెగాస్టార్ ఇచ్చిన కితాబు. తనకు “విజేత” సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలా అయితే దరిచేరారో, ఈ ‘గీత గోవిందం’ సినిమాతో విజయ్ దేవరకొండకు అన్ని వర్గాల ప్రేక్షకులు చేరువయ్యారని చెప్పుకొచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత సక్సెస్ అయినా, అది అన్ని వర్గాల వారిని అలరించలేదన్నది నిజమని, కానీ ‘గీత గోవిందం’తో అది సాధ్యమయ్యిందని చెప్పిన చిరంజీవి, ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ ను అనుకరిస్తూ డైలాగ్స్ కూడా చెప్పారు. అలాగే ‘గీత గోవిందం’లో విజయ్ పలికే ‘మేడమ్ మేడమ్’ అనే వ్యాఖ్యలను స్టేజ్ పైన పలికి చూపించారు. చిరు ఇలా పలుకుతుంటే, బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఈ ఈవెంట్ లో చిరు చేసిన ప్రకటనతో టాలీవుడ్ లోకి కొత్త స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ అవతరించినట్లయ్యింది. అయితే ఈ స్టార్ కు ఎలాంటి బిరుదు ఇవ్వాలో అన్నది ఇంకా ఖరారు చేయలేదు. అభిమానులను ముద్దుగా ‘రౌడీ’ అని పిలుచుకునే విజయ్, టాలీవుడ్ లో “రౌడీ స్టార్”గా మారతారేమో, కాలమే సమాధానం చెప్పాలి గానీ, సక్సెస్ మీట్ లో “గీత గోవిందం’ సినిమా యూనిట్ అంతా ఫుల్ ఖుషీలో ఉంది.

ADVERTISEMENT
Latest Stories