మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. దీనివల్ల సినిమా విడుదల ఏకంగా 2021 సమ్మర్ కు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం రామ్ చరణ్ ని అనుకుంటున్నారు. మే నెలలో రామ్ చరణ్ ని సినిమా కోసం షూట్ చెయ్యాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు షూటింగ్స్ వాయిదా పడటంతో రామ్ చరణ్ ని మధ్యలో పంపే ఆలోచన లేదు జక్కన్నకు. జులై లేదా ఆగస్టుకి గాని రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ నుండి విడుదల కాడు.
అంటే ఆగష్టు 14 విడుదల సాధ్యం కాదు. దసరాకు విడుదల చేద్దామంటే కేజీఎఫ్ 2 ఉంది… సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుంది. అన్ సీజన్ లో విడుదల చేస్తే తప్ప ఆచార్య ఈ మధ్యలో విడుదల అయ్యే అవకాశం లేదు. దీనితో మంచి సీజన్ కోసం చిరంజీవి తన సినిమాని 2021 సమ్మర్ కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
మణి శర్మ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే మొదలయ్యింది. దాదాపుగా అన్ని ఏరియాలలో అల వైకుంఠపురములో సాధించిన కలెక్షన్స్ రేటుకు సినిమా రైట్స్ ని అమ్ముతున్నారట. కొరటాల శివకు ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. పైగా అతని ప్రతీ సినిమా ఆయా హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి. ఈ పాయింట్ మీద ఆచార్య రైట్స్ భారీ రేట్లకు అమ్ముతున్నారట





