2019 ఎన్నికల్లో పవన్ తరపున చిరు ప్రచారం?

Chiranjeevi Contest For Janasena Pawan Kalyan 2019ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ భూస్థాపితం అయిన తర్వాత రెండే ప్రధాన పార్టీలు ఉంటాయని భావించిన వారికి ‘జనసేన’ను బరిలోకి దింపి, తానోస్తున్నానంటూ పవన్ అడుగుపెట్టాడు. అయితే గత ఎన్నికలలో పవన్ పోటీ చేయకపోవడం, ఆ తర్వాత కూడా తనకు అధికారం అవసరం లేదని చెప్పడంతో, పవన్ రాజకీయాలను సీరియస్ గా పరిగణించాల్సిన ఆవశ్యకత లేకపోయింది. అయితే కాలక్రమేణా పవన్ స్వరంలో వస్తున్న మార్పులతో తెలుగుదేశం – వైసీపీ నడుమ జనసేన ‘కింగ్ మేకర్’గా అవతరిస్తుందన్న సంకేతాలు రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికిప్పుడు ఇది అసాధ్యంగా కనపడుతున్నా రాబోతున్న రెండు సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే, పవన్ వ్యవహరిస్తున్న తీరుతో రెండు పార్టీలకు చెక్ పెట్టడం ఖాయంగా కనపడుతోంది. అయితే ఇది పవన్ ఒక్కడి వలన సాధ్యమయ్యే పనేనా? అంటే దానికి సమాధానం తెలియాలంటే మరో ఏడాదిన్నర్ర సమయం అయినా గడవాలి గానీ, పవన్ సోదరుడు నాగబాబు మాత్రం ‘మెగా కాంపౌండ్’ అంతా పవన్ కు అండగా ఉండాలని కోరుకుంటున్నారు. తానూ రాజకీయాల్లో పోటీ అంటూ చేస్తే జనసేన తరపున మాత్రమే చేస్తానని, ఇప్పటికే స్పష్టం చేసిన నాగబాబు, ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు సహాయ సహకారాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు.

ADVERTISEMENT

వీకెండ్ కార్యక్రమాలలో భాగంగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు విషయాలను వెల్లడించారు నాగబాబు. ఈ మెగా సోదరుడు భావాల ప్రకారం… తదుపరి సార్వత్రిక ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘జనసేన’ తరపున ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మాటకొస్తే, ఒక్క చిరంజీవే కాదు, మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు తోడుగా నిలవాలన్నది తన కోరికగా చెప్పుకొచ్చారు. అయితే సినిమాల పరంగా చిరంజీవికున్న ఇమేజ్ ప్రజల్లో ఎంత పాజిటివ్ భావాలను కలిగిస్తాయో, రాజకీయాల దగ్గరికి వచ్చేపాటికి మెగాస్టార్ కు అంతకన్నా పదింతలు నెగటివ్ అభిప్రాయాలు ప్రజల మనస్సులో నాటుకుని పోయాయన్న విషయాన్ని నాగబాబు గారు గుర్తించినట్లు లేరు.

ADVERTISEMENT
Latest Stories