మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమాకు చాలా సమయం ఉంది. దానికి ముందే అభిమానులను మురిపించడానికి వదిలిన శాంపిల్ ను వీక్షించాలనే కుతూహలం ప్రతి మెగా అభిమానిలో దాగి ఉంది. అదే ఇటీవల హైదరాబాద్ లో ముగిసిన మా సినీ అవార్డ్స్ లో మెగాస్టార్ స్టెప్పులు. ఈ కార్యక్రమం ఎప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు పండగ లాంటి వార్తను సదరు టెలివిజన్ యాజమాన్యం అందించింది.
ఈ నెల 25, 26 తేదీలలో మా సినీ అవార్డ్స్ వేడుకను ప్రసారం చేయబోతున్నట్లుగా సదరు ఛానల్ ప్రోమో విడుదల చేసింది. దీంతో మెగా అభిమానుల అందరి చూపులు ఈ నెలాఖరుపై పడ్డాయి. చిరు స్టెప్పులతో, మెగా ప్రసంగాలతో, చిరుపై అతిధులు చేసిన ప్రశంసలతో నిండిపోయి ‘మా’ సినీ అవార్డ్స్ కాస్త, ‘మెగా’ సినీ అవార్డ్స్ గా మారిపోయిన వైనాన్ని అభిమానులు కన్నులవిందుగా తిలకించడానికి సిద్ధంగా ఉన్నారు మరి!



