మెగాస్టార్ ఇంట అల్లుడుగా ప్రవేశించబోతున్నారంటే, ఒక్క ఆ కుటుంబ వర్గీయుల కళ్ళే కాదు, ఫ్యాన్స్ ను కూడా కుటుంబంగా భావించే మెగాస్టార్ అభిమానుల కళ్ళన్నీ కూడా అతని వైపుకే చూస్తాయి. అయితే, శ్రీజ వివాహంలో జరిగిన ఒడిదుడుకుల రీత్యా, తాజా వివాహం ‘గుట్టుచప్పుడు’ కాకుండా చేసుకుంటున్నారు చిరు. దీంతో చిరుకు కాబోయే అల్లుడు ఎలా ఉంటారన్న అభిమానుల ఉత్సుకతకు బ్రేక్ పడినట్లయ్యింది.
కానీ, ప్రస్తుత ఉన్న మీడియా రేంజ్ కు ఎవరి ఫోటోలైనా సెకన్లలో బయటకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి ‘చిన్నల్లుడు’ ఫోటోలు ఇవేనంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అందం విషయంలో చిరు కుటుంబంలో ఒక్క మెగాస్టార్ ముఖకవళికలు మాత్రమే ఆకట్టుకునే విధంగా ఉంటాయన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే తాజాగా కళ్యాణ్ పేరుతో హల్చల్ చేస్తున్న ఈ ఫోటోలు ఫ్యాన్స్ ను ఓ మాదిరిగా ఆకట్టుకుంటున్నాయి.
కొందరైతే మెగా ఫ్యామిలీకి మరో హీరో దొరికాడంటూ కితాబిస్తున్నారు. శ్రీజ క్లాస్ మేట్ అయిన కళ్యాణ్ కు నిజంగా హీరో అయ్యేటంత సీన్ ఉందా? అన్నది తెలియాలంటే, ఈ నెల 25న జరగబోతున్న శ్రీజ వివాహా కార్యక్రమం ముగియాల్సిందే. అప్పుడు స్పష్టమైన ఫోటోలు అధికారికంగా వెలుగులోకి రావచ్చు. మొత్తానికి చిరు రెండవ అల్లుడు కాస్త చూడదగిన విధంగానే ఉన్నాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.



