“కత్తిలాంటోడు” ఫస్ట్ డే… మెగాస్టార్ తో కలిసి..!

Chiranjeevi-Devi-SriPrasad-150 movie photoమెగా కాంపౌండ్ లో సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ఏ రేంజ్ లో సంగీతం అందిస్తారో అందరికీ తెలిసిన విషయమే. “శంకర్ దాదా ఎంబిబిఎస్” మొదలుకొని మొన్నటి “సర్ధార్ గబ్బర్ సింగ్” వరకు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను మెప్పించే సంగీతం అందించే దేవి, ప్రతిష్టాత్మక మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు కూడా సంగీతం అందించనున్న విషయం తెలిసిందే.

“కత్తిలాంటోడు” వర్కింగ్ టైటిల్ గా వినపడుతున్న ఈ సినిమా లాంఛనంగా ఇటీవల ప్రారంభం కాగా, దేవిశ్రీ ఆధ్వర్యంలో మ్యూజిక్ సిట్టింగ్ కూడా మొదలయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా పాల్గొనగా, ‘బాస్’తో కలిసి మొదటి రోజు… అంటూ దేవిశ్రీ ప్రసాద్ చిరు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. యధావిధిగా చిరునవ్వు చిందిస్తూ మెగాస్టార్ ఇచ్చిన లుక్ ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉండగా, చిరు గడ్డం హైలైట్ అంటున్నారు అభిమానులు.

ADVERTISEMENT

మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ… వెల్కం బ్యాక్ చెప్పిన దేవిశ్రీ… తమ అభిమాన హీరోకు అదిరిపోయే పాటలను, బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాకు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో… మెగా ఫ్యాన్స్ ఆకలిని ఈ సినిమా పాటలతోనైనా తీర్చేస్తారని ఆశిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories