మహేష్, చిరులకు షాక్ ఇవ్వనున్న పవన్?

chiranjeevi khaidi no 150 mahesh babu 23  pawan kalyan katamarayudu first lookఈ దీపావళికి రానున్న ఫస్ట్ లుక్ పోస్టర్లలో రెండు సినిమాలు సినీ ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి. అందులో ఒకటి, మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఖైదీ నంబర్ 150” కాగా, మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “అన్ టైటిల్డ్” మూవీకి సంబంధించినది. దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత చిరు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో… అసలు మా మెగాస్టార్ ఎలా ఉంటాడా? అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫోటోలు అభిమానుల అంచనాలను మరింతగా రెట్టింపు చేసాయి. దీంతో “ఖైదీ నంబర్ 150”లో చిరు ఎలా ఉంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక, చాలాకాలం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు ఓ తమిళ దర్శకుడికి అవకాశం ఇవ్వడంతో ఈ సినిమా పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అది కూడా మురుగదాస్ వంటి ఒక ఓటమి ఎరుగని దర్శకుడు, కమర్షియల్ ఎలిమెంట్స్ ను, సోషల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి అద్భుతంగా తెరకెక్కించగల దర్శకుడు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ప్రిన్స్ అభిమానులు నిరీక్షిస్తున్నారు. అందులోనూ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా ప్రిన్స్ ను సరికొత్తగా చూపిస్తానని ఇప్పటికే దర్శకుడు ఓ ప్రకటన చేయడంతో, ఈ సినిమాపై మార్కెట్ వర్గాల్లో మరింత ఆసక్తి పెరిగింది. తొలిసారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సమయం ఇంకా విడుదల కావాల్సి ఉంది.

ADVERTISEMENT

ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సడెన్ ఎంట్రీ ఇస్తూ షాక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. శనివారం నాడు సాయంత్రం “కాటమరాయుడు” ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా ట్రేడ్ టాక్. ఇదే జరిగితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇద్దరు అభిమానుల మధ్య మళ్ళీ పోటీ వాతావరణం, ఒక రకమైన దీపావళి పండగ శోభ నెలకొంటుంది. పోటీ ఉంటేనే కదా… ఎవరికైనా అసలు మజా ఉంటుంది. మరి ఈ ముగ్గురి ప్రధాన హీరోల ఫస్ట్ లుక్ లలో ఎవరిదీ పైచేయో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories