చిరంజీవిపై రెండేళ్ళ నాటి వీడియో… ప్రస్తుతం సందడి చేస్తోంది..!

Chiranjeevi Khaidi No 150 Tollywood2014వ సంవత్సరం… వారాంతంలో భాగంగా ఓ ప్రముఖ మీడియా అధినేత సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసే క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కే.ఎస్.రామారావుతో ఇంటర్వ్యూ చేయగా… అందులో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన వచ్చింది. అప్పటికి మెగాస్టార్ 150వ సినిమా ప్రకటన అధికారికంగా వెలువడలేదు గానీ, చేయబోతున్నారన్న వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇదే విషయం గురించి నిర్మాత రామారావును సదరు మీడియా అధినేత ప్రశ్నిస్తూ… చిరంజీవి నటిస్తే ఇంకా చూస్తారా? అన్న రీతిలో మాట్లాడడం ప్రస్తుతం హల్చల్ చేయడానికి కారణమైంది.

సినిమాల్లో ఉన్నప్పుడు హీరోల మీద క్రేజ్ ఉండడం సహజమే గానీ, ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత జనాల్లో, ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గిపోతుంది కదా… ఒకవేళ సినిమాల్లో ఆయన నటించొచ్చు… జనం చూడొద్దు..? అంటూ ఓ వెటకారపు ప్రశ్న వేయగా… స్పందించిన కే.ఎస్.రామారావు బదులిస్తూ… మెగాస్టార్ ఎప్పటికైనా మెగాస్టారే… ఆయన ఎప్పుడూ నటించినా ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. ఆయన ఓకే చెప్పాలే గానీ, చిరంజీవితో సినిమాలు నిర్మించడానికి ఇండస్ట్రీలో నిర్మాతలు క్యూలు కడతారు. అయితే తనకున్న సమాచారం ప్రకారం… ఆయనే సొంతంగా ఒక సినిమా తీయబోతున్నారని, వీలు కల్పిస్తే తానూ కూడా ఒక సినిమాను నిర్మిస్తానని అన్నారు.

ADVERTISEMENT

ఈ సమయంలో కూడా సదరు మీడియా ప్రతినిధి మాట్లాడుతూ… ‘ఇంకా ధైర్యం చేస్తారా?’ అని అడగగా, చిరుతో చేయడానికి ధైర్యం ఎందుకు? ఆయన ఉంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకులు వచ్చేస్తారు. ఆయన స్టామినా వేరు… అంటూ మెగాస్టార్ రేంజ్ గురించి స్పష్టంగా తెలియజేసారు రామారావు. అయితే ఈ వ్యాఖ్యలు “ఖైదీ నంబర్ 150” రికార్డులు బద్దలు కొడుతున్న వేళ మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సదరు మీడియా ప్రతినిధి మాదిరి అనుకున్న వాళ్ళకు ఇప్పుడు సమాధానం లభించిందని… సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు తమ అనుభూతులను పంచుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories