మెగాస్టార్ తీసుకున్న అతి “మంచి” నిర్ణయం!

chiranjeevi-quits-filmsఒక సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలు తీసుకున్నారు. అంత సమయం తీసుకున్న తర్వాత కూడా ఓ రీమేక్ కధకు ఓకే చెప్పారు. అంటే కధల ఎంపికలో తానూ పడుతున్న తడబాటు ఏమిటో బహుశా మెగాస్టార్ కు అర్ధమైయ్యుంటుంది. అందుకే ప్రస్తుతం తానూ ఒప్పుకున్న “కత్తి” రీమేక్ తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారట.

ఇటీవల జరిగిన నూతన సంవత్సరపు వేడుకల్లో ఈ దిశగా చిరు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. తన సన్నిహితులు, బంధువులు, వీరాభిమానుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఈ కధనాల సారాంశం. ఈ నిర్ణయం మార్చుకోవాల్సిందిగా అభిమానులు ఒత్తిడి తెచ్చినప్పటికీ, మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయం విన్న ‘మెగాస్టార్’ అభిమానులు నిరుత్సాహపడ్డప్పటికీ, చిరంజీవి తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రచయితల వద్ద కధల కొరత లేదు గానీ.., తనకున్న బ్యాడ్ పొలిటికల్ కెరీర్ రీత్యా ఫలానా కధలో అభిమాన ప్రేక్షకులు చూస్తారా? చూడరా? అనే మీమాంసలో చిరు పడిపోయారని టాలీవుడ్ వర్గాలు కధలుకధలుగా చెప్పుకుంటున్నాయి. అందుకే తన 150వ సినిమాకు కూడా సేఫ్ సైడ్ గా ఓ రీమేక్ కధను ఎంచుకున్నారని, ఇక మున్ముందు చిరుకు కధలు దొరకడం కష్టమేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

అదీ గాక, ఇటీవల ‘బ్రూస్ లీ’లో పోషించిన ‘అతిథి’ పాత్రకు అంతంత మాత్రపు స్పందనే రావడంతో… మున్ముందు తన సినీ కెరీర్ విమర్శల పాలు ఇష్టం లేకనే మెగాస్టార్ ‘రిటైర్మెంట్’ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తనకున్న క్రేజ్ రీత్యా అయినా కమర్షియల్ గా ‘బ్రూస్ లీ’ గట్టెక్కుతుందనుకుంటే, ఆ ఆశలన్నీ అడియాసలు చేసింది. దీంతో అన్ని సమాలోచనలు చేసిన చిరంజీవి, తన సినీ ‘రిటైర్మెంట్’ను కొత్త సంవత్సరం కానుకగా తీసుకున్నారని సినీ, మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తున్న వార్తలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో!

ADVERTISEMENT
Latest Stories