ఫ్లాష్ ఫ్లాష్… మెగాస్టార్ చిరంజీవితో రాజమౌళి!

chiranjeevi-rajamouliమెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండడంతో మంచి ఉత్సాహంలో ఉన్నారు. ఈ ఉత్తేజంలో మరుసటి రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అయితే మెగా అభిమానులు మాత్రం రాజమౌళి – మెగాస్టార్ కాంభినేషన్ సెట్ కావాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అంతకుముందు ‘మగధీర’ సినిమాలో ఓ రెండు, మూడు షాట్స్ వీరిద్దరి జోడిలో వచ్చిన విషయం తెలిసిందే.

అయితే చిరంజీవి వంటి హీరోలను దర్శకత్వం వహించే స్థాయి తనకు లేదని చెప్పిన రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి 2’ పనిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళి, తన ‘బాహుబలి’ హీరో ప్రభాస్ తో కలిసి ‘ఖైదీ నంబర్ 150’ సెట్స్ లో దర్శనమిచ్చారు. కారణం ఉందో లేక క్యాజువల్ గా కలిసారో గానీ, ప్రభాస్ – చిరంజీవిలు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటుండగా, దానిని చూసి రాజమౌళి నవ్వుతూ మురిసిపోతున్నారు.

ADVERTISEMENT

దీనికి సంబంధించిన ఫోటోలను ‘ఖైదీ నంబర్ 150’ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా, అవి ప్రస్తుతం అభిమాన సందోహంలో హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్కన ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ రికార్డులను ‘ఖైదీ నంబర్ 150’ దాటేసిందన్న ట్రేడ్ వర్గాల టాక్ తో, ‘బాహుబలి – ఖైదీ’ల కలయిక హాట్ టాపిక్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories