చిరంజీవి చిలిపి చేష్టలు!

chiranjeevi naughty things acharya press meetమెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలలో చేసిన కామెడీని అందరూ చూసి ఎంజాయ్ చేశారు. కానీ సినిమా ప్రమోషన్ వేదికలపై ఎప్పుడూ హుందాగా గంభీరంగా ఉండే చిరంజీవి సరదా హీరోయిన్‌ని ఆట పట్టించడం ఎప్పుడైనా చూశారా?ఆచార్య ప్రమోలో మెగాస్టార్ హీరోయిన్ పూజా హెగ్డేని ఆట పట్టించారు. అది చూసి రామ్ చరణ్‌, పూజా హెగ్డేలతో ప్రేక్షకులు అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

కార్యక్రమంలో ముందుగా చిరంజీవి, పూజా, రామ్ చరణ్‌ ముగ్గురూ నిలబడి ఫోటోలు దిగారు. తరువాత రామ్ చరణ్‌, పూజా వెళ్లిపోతుంటే అది గమనించని చిరు పూజ కోసం చెయ్యి చాపారు. కానీ అప్పటికే ఆమె కాస్త దూరంగా వెళ్ళిపోవడంతో మెగాస్టార్ ఏమాత్రం తడబడకుండా ఆమెను తాడుతో తనవైపు లాగుతున్నట్లు యాక్ట్ చేశారు. అది చూసి అందరూ పకపకమని నవ్వడంతో వెనక్కి తిరిగి చూసిన రామ్ చరణ్‌ కూడా నవ్వుతూ పూజాను తండ్రి వద్దకు తీసుకువచ్చారు.

ADVERTISEMENT

చిరు పూజా చేతిని అందుకొన్నాక “మేమిద్దరం ఫోటో దిగుతుంటే మద్యలో నువ్వేందుకురా?” అన్నట్లు చేతితో పో…పొమ్మనట్లు సైగలు చేయడం చూసి మళ్ళీ రామ్ చరణ్‌తో సహా అందరూ పకపకమని నవ్వారు. అప్పుడు చిరు… చేతులు నలుపుకొంటూ ‘ప్లీజ్…ప్లీజ్…’ అన్నట్లు తనవైపు చూస్తుండటంతో ఈసారి విరగబడి నవ్వడం పూజా హెగ్డే వంతు అయ్యింది. తరువాత చిరు ఆమె చుట్టూ చేయబోయి అందరూ చూస్తుండగా దొరికిపోయానన్నట్లు నాలిక కరుచుకొన్నట్లు నటించడంతో అది చూసి మళ్ళీ అందరూ హాయిగా నవ్వుకొన్నారు.

చిరుతో ఫోటో సెషన్ పూర్తయ్యాక పూజా హెగ్డే మళ్ళీ రామ్ చరణ్‌ వైపు వెళుతూ, చిరంజీవికి చేతలకి ఫిదా అయ్యానని సూచిస్తూ రెండు చేతులతో సెల్యూట్ చేసి వెళ్ళడం చూసి ఆడిటోరియమ్ చప్పట్లతో మారు మ్రోగిపోయింది. ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూడాల్సిందే తప్ప మాటలలో వర్ణించడం కష్టమే.

ADVERTISEMENT
Latest Stories