చిరు – పవన్ సినిమాపై పేలుతున్న జోకులు!

Chiranjeevi Pawan Kalyan Mutli star Movie Jokesమెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంభినేషన్ లో సినిమా అని ప్రకటన వచ్చిన తర్వాత, ఆనందం వ్యక్తం చేయాల్సిన సినీ అభిమానులు కాస్త సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుస్తున్నారు. దీనికి కారణం చిరు, పవన్ లపైన ఉన్న అక్కసుతో మాత్రం కాదు. గతంలో ఇలాంటి భారీ భారీ కాంభినేషన్లు విని విని ఒక విధంగా ప్రేక్షకులు, సినీ జనాలు విసిగిపోయి ఉన్నారు. దీంతో ఈ ‘మెగా’ ప్రొజెక్ట్ పై సోషల్ మీడియాలో కడుపుబ్బా నవ్వు తెప్పించే జోకులు పేలుతున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే…

చిరు : ముందు వాడ్ని అడగండి
పవన్ : ముందు అన్నయ్యను అడగండి
టీఎస్సార్ : ఇలా కాదు గానీ, ముందు ప్రెస్ నోట్ ఇచ్చేద్దాం

ADVERTISEMENT

ఇంతకీ ఈ విషయం చిరు, పవన్ లకు తెలుసా?
99% జరగదు అనే అనుకుందాం…
1% నిజమైతే మాత్రం… అంటూ బ్రహ్మి ఫోటోతో పోస్ట్..!

ఎలాగో మెగాస్టార్ ను పవర్ స్టార్, పవర్ స్టార్ ని మెగాస్టార్ డైరెక్ట్ చేసుకుంటారు కాబట్టి, ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ఇంకో మూవీ తీయొచ్చు.

చిరు – పవన్ కాంభినేషన్ లో సినిమాను ఉదాహరిస్తూ… ఒకవేళ వెంకటేష్ ప్రసాద్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు దింపినట్లయితే సెంచరీ చేసేవారు.

ఇలాంటి పంచ్ లు, జోకులకు ఈ సినిమా న్యూస్ సోషల్ మీడియాలో కొదవలేకుండా పోయింది. ఇలాంటి నమ్మశక్యం కాని న్యూస్ వచ్చినపుడు, నెటిజన్లు కాసేపు సరదాగా నవ్వించే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ సందోర్భోచితమైన జోకులు.

ADVERTISEMENT
Latest Stories