మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఈరోజు మీడియా ప్రవర్తించిన తీరు చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంతకీ చిరంజీవి విషయంలో మీడియా ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే, ఈరోజు చిరంజీవి తన సోషల్ మీడియాలో పొలిటికల్ డైలాగ్‌ను ఆడియో రూపంలో పోస్ట్ చేశారు. ‘నేను రాజకీయంకు దూరం అయ్యాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అంతే మీడియా అంతా ఒక్కసారిగా ఆ ఆడియోను హైలైట్ చేస్తూ న్యూస్ క్రియేట్ చేసింది. ఆ డైలాగ్ విన్నవారికి అది సినిమాలోని డైలాగ్ అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ.. మీడియా మాత్రం అదేదో చిరంజీవి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ న్యూస్ అల్లేసింది.
నిజానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా దాన్ని విలీనం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన ఆలోచన అంతా సినిమాలపైనే పెడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సత్సంబంధాలను పాటిస్తున్నారు. చాలా సందర్భాల్లో రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశాననే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారు.
అలాంటి విషయాన్ని మీడియా మరచిపోయిందో.. లేక కావాలనే చేసిందో తెలియదు. అయితే చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారంటూ.. కాదు కాదు పవన్ కళ్యాన్ జనసేన పార్టీలో జాయిన్ అవుతారంటూ వార్తలను అల్లేశారు. స్కోలింగ్స్, లైవ్ లో రిపోర్టర్స్ మాట్లాడేయటం జరిగాయి. అయితే మీడియా చేస్తోన్న ఈ ఓవర్ యాక్షన్‌పై పొలిటికల్ వర్గాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా నవ్వుకున్నారు. అసలు మీడియా అతి చేయటం కాకపోతే మరేంటని అనుకున్నారు. చిరంజీవిని కాదనే పవన్ జనసేన పార్టీని పెట్టారు. పార్టీని పెట్టిన సమయంలో, అడపా దడపా కొందరు రాజకీయ నాయకులు జనసేన పార్టీని కూడా పవన్.. చిరంజీవి దారిలోనే వెళ్లి విలీనం చేస్తారనే కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి వెళ్లి జనసేనలో ఎందుకు చేరతారనే దానిపై ఎవరూ మాట్లాడలేదు. అంతెందుకు చిరంజీవితో మాట్లాడేంత పరిచయం ఉన్న రిపోర్టర్స్ కూడా ఈ విషయంపై ఆయన నోట్ తీసుకోకపోవటంపై అతిలోనే అతిగా అనిపించింది.
Exclusive Video Interviews: Watch & Subscribe





