రామ్ చరణ్ మొదలుపెట్టిన కథను చిరంజీవి ముగిస్తారు

Chiranjeevi - Ram Charan- Acharya movieమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి యొక్క ఆచార్యలో అతిధి పాత్రలో కనిపిస్తారని మన పాఠకులకు తెలుసు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా చరణ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ అప్పటికే విడుదల చేశారు. ఈ చిత్రంలో చరణ్ ను నటింపచేయ్యడం వెనుక ఉన్న ఆలోచనను దర్శకుడు కొరటాల వెల్లడించారు.

ADVERTISEMENT

“చరణ్ క్యారెక్టర్ యొక్క రన్ టైం గురించి వదిలేయండి. ముప్పై నిముషాలు… నలభైఐదు నిముషాలు అనే విషయం పక్కన పెట్టండి. చరణ్ ది చాలా ముఖ్యమైన పాత్ర. కథకు సంబంధించిన ప్రధాన ఎమోషన్ అతని పాత్రతో కనిపిస్తుంది. ఏదో చరణ్ ను పెట్టాలని అనుకోవడం వల్ల ఈ చిత్రానికి అతన్ని తీసుకోలేదు. ఆచార్య కథ అతని ఎమోషన్ తో మొదలవుతుంది. అతను కథలో భాగం ,” అనో కొరటాల అన్నారు.

“ఒక రకంగా చెప్పాలంటే, ఇది చరణ్ కథ…. చిరంజీవి ఆ కథను పూర్తి చేస్తారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రధాన భాగం” అని ఆయన అన్నారు. ఆచార్య మే 13 న సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయింది. మిగిలిపోయిన షూట్ పూర్తి చేయడానికి కేసులు తగ్గేవరకు చిత్రబృందం వేచి చూస్తుంది.

మెగాస్టార్‌తో పాటు కాజల్ అగర్వాల్ కనిపించనుండగా, రామ్ చరణ్ పూజా హెగ్డేతో రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. కొంత పరిస్థితి కుదుటపడగానే… చిత్రంలోని రెండవ పాటను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తుంది ఆచార్య టీం. ఆ సాంగ్ రామ్ చరణ్, పూజా హెగ్డే మీద షూట్ చేసిన రొమాంటిక్ నెంబర్.

ADVERTISEMENT
Latest Stories