శర్వానంద్ ఫస్ట్ షాట్ చిరంజీవితోనే!

Chiranjeevi Sharwanand Shatamanam Bhavati Sucess meetటాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న శర్వానంద్ కు – మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఉంది. శర్వానంద్ తొలిసారిగా కెమెరాను ఫేస్ చేసింది చిరంజీవితో పాటే అన్న విషయం ఇప్పటివరకు పెద్దగా తెలియకపోయినా… ‘శతమానం భవతి’ సక్సెస్ మీట్ వేడుకపై మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలతో శర్వా ఎంట్రీ ఎలా ఇచ్చారో తెలిసి వచ్చింది.

రామ్ చరణ్ – శర్వానంద్ లు మంచి స్నేహితులని, అయితే సినిమాల్లో నటిస్తానని శర్వా తనతో ఎప్పుడూ చెప్పలేదని, ‘థమ్సప్’ యాడ్ లో నటించాడని, తన సినిమాలో యంగ్ స్టర్ కావాలంటే ఇంట్లోనే ఉన్న శర్వను… ‘నటిస్తావా?’ అని అడిగానని, ‘మీ సినిమాలో అయితే నటిస్తానన్నాడని, తనతోనే మొట్టమొదట కెమెరాను ఫేస్ చేశాడని గుర్తు చేసుకున్నారు.

ADVERTISEMENT

నా బిడ్డకు మంచి విజయం దక్కిందంటే అంతకు మించిన సంతోషం ఏముంటుందని అని మెగాస్టార్ చెప్పగానే, శర్వానంద్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసిన దర్శకుడు, నిర్మాతలకు అభినందనలని చెప్పిన చిరు, నరేష్ ను ప్రతి ఏటా కుటుంబ ఫంక్షన్లలో కలుస్తుంటానని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని, ఇంద్రజను చూసి చాలా కాలమైందని, ఈ సినిమా నీ కోసం చూస్తానని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories