పండగ పూట మెగా ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త

chiranjeevi interaction with fans on ugadhi 2020టాలీవుడ్ నుండి సోషల్ మీడియాకు ప్రవేశించబోతున్న తాజా సెలబ్రిటీ ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రేపు ఉగాది సందర్భంగా, మెగాస్టార్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉపయోగించి అభిమానులతో ఇంట్రాక్ట్ కావడం ప్రారంభిస్తారు. ఈ వార్తతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.

వివిధ అంశాలపై తన అభిప్రాయాలను అభిమానులకు పంచుకునేందుకు, తన మెస్సేజ్లను ప్రజలతో పంచుకోవడానికి తాను సోషల్ మీడియాకు వస్తున్నానని చిరంజీవి ఒక చిన్న వీడియోను విడుదల చేశాడు. గతంలో రామ్ చరణ్ ట్విట్టర్‌లో ఉండేవాడు, కాని తరువాత ట్విట్టర్ లో నెగటివిటీ చాలా ఎక్కువగా ఉన్న కారణంగా రామ్ చరణ్ ట్విట్టర్ నుండి వెళ్లిపోయారు.

ADVERTISEMENT

అయితే అతను ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటాడు. చిరంజీవి రామ్ చరణ్ ను అనుసరిస్తారా లేదా ట్విట్టర్ మరియు ఫేస్బుక్ రెండింటిలోకి ప్రవేశిస్తారా అని చూడాలి. చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఆచార్యతో బిజీగా ఉన్నారు. విజయవంతమైన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్ ఆపేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదల చేయాలనేది ప్రణాళిక. విడుదలకు మంచి సమయం ఉన్నందున, ఈ ఆలస్యం దానిపై ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ చిత్రం ఎండోమెంట్స్ విభాగంలో అవినీతికి సంబంధించిన సబ్జెక్టు గురించని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories