ఒక హీరోగా ఎంత సక్సెస్ అయినా… రాజకీయంగా చిరంజీవి అట్టర్ ఫ్లాప్ అన్న విషయం వీరాభిమానులు సైతం అంగీకరించే విషయమే. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్న సందర్భంగా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ జెండాలు దర్శనమివ్వడం మెగాస్టార్ కు కొంత అసంతృప్తిని కలిగించినట్లుగా కనపడుతోంది.
ఈ వేడుకలో మెగాస్టార్ మైక్ అందుకున్న సందర్భంలో… చిరుకు ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి ‘జనసేన’ పార్టీ జెండాను పట్టుకుని అటు ఇటుగా ఊపుతున్నాడు. ఇది గమనించిన మెగాస్టార్, ఆ జెండాను తీసివేయాల్సిందిగా చేతులతో ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ, సదరు అభిమాని మాత్రం అలాగే జెండా పట్టుకుని ఊపుతూ ఉండగా, కాస్త సీరియస్ గా చూసిన మెగాస్టార్, సదరు జెండాను క్రిందికి దించాల్సిందిగా మరొకసారి చేతులతో చూపించారు.
ఒకప్పుడు తమ అభిమాన హీరో ఏం చేసినా భుజాన పెట్టుకుని చూసేవారు. కానీ, మారిన కాలం రీత్యా… అభిమాన హీరోలను ఇబ్బందిపెట్టే విధంగా కొందరు అభిమానులు ప్రవర్తిస్తుండడం ఒక విధంగా స్టార్ హీరోలకు షాక్ ను గురిచేసే అంశమే. గతంలో అల్లు అర్జున్ చేసిన ‘చెప్పను బ్రదర్’ కామెంట్ కు, మెగా హీరో అన్న కనికరం కూడా లేకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ బన్నీని ఓ ఆట ఆడేసుకున్న విషయం తెలిసిందే.
Chiranjeevi isweet warning to take down Janasena flag at #KhaidiNo150 Audio Launch pic.twitter.com/2IJB7uOHL4
— Mahesh 23 (@FanOfSSMB) January 8, 2017



