చిరంజీవి నోట పవన్ కళ్యాణ్ పేరు!

Chiranjeevi Wishes VV vinayak Happy Birthdayగత కొన్ని సంవత్సరాలలో మెగాస్టార్ చిరంజీవిని పరిశీలిస్తే… పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించింది చాలా అరుదు. ‘ప్రజారాజ్యం’ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన నాటి నుండి గమనిస్తే… ఒక్క ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ షూటింగ్, ఆడియో వేడుకలోనే ఇద్దరూ కలివిడిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి కార్యక్రమాల్లో వారు నిమగ్నమవుతూ… చిరు తన రీ ఎంట్రీ కోసం సిద్ధమవుతుండగా… పవన్ రాజకీయాలను పక్కన పెట్టి, మళ్ళీ తన సినిమాకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు.

ADVERTISEMENT

నాణానికి మరో వైపు పరిశీలిస్తే… పవన్ కళ్యాణ్ మాత్రం సందర్భం వచ్చిన సమయంలోనూ, సినీ ఆడియో వేడుకలపైన తన అన్న చిరంజీవి గురించి గొప్పగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కొత్త సినిమా “ఖైదీ నంబర్ 150”కు సంబంధించిన ఓ వీడియోను దర్శకుడు వినాయక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ విడుదల చేసారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వినాయక్ ను తన తమ్ముడిగా అభివర్ణించిన సందర్భంలో… ‘నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఎంతో తనకు సోదరులో వినాయక్ కూడా అలాంటి తమ్ముడేనని’ చెప్పుకొచ్చారు.

గతంలో హీరో శ్రీకాంత్ గురించి కూడా చెప్పిన సందర్భంలో కూడా మెగాస్టార్ ఇవే మాటలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సదరు శ్రీకాంత్ ఎక్కడ ఉన్నాడో గానీ, ఆయన స్థానంలో ‘ఖైదీ నంబర్ 150’ దర్శకుడు వినాయక్ వచ్చి చేరాడు. సహజంగా సినీ పరిశ్రమలో ఇలాంటి అసందర్భపు, అసత్యపు మాటలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ, మెగాస్టార్ లాంటి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడడం అనేది అభిమానులు జీర్ణించుకోలేని విషయం. బహుశా ఎంతమంది వచ్చినా ఆదరించేటంత విశాలమైన మనసు మన మెగాస్టార్ సొంతమేమో..?!

ADVERTISEMENT
Latest Stories