చిరు 2.0లో హిట్లు కొట్టాడా, ఆ రేంజ్ ఫ్లాప్స్ ఎందుకు పడ్డాయ్ అనే టాపిక్కులు పక్కన పెట్టేస్తే అందరికీ ఒకటే లోటు ఉంది: డైరెక్టర్లు ఆయన్ను ‘వింటేజ్ చిరంజీవి’గా చూపించడానికి ఉపయోగిస్తున్న బట్టలు, చేసిస్తున్న కామెడీ.
డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అందరిలా చాలా చెప్పేశారు, కానీ కామెడీ మూవీ కాబట్టి పెద్దగా ఎవరు నమ్మాలా, సీరియస్ గా తీస్కొలా, ఆయన మార్పు చేయగలరని.
Mana Shankara Vara Prasad Garu లో ‘మీసాల పిల్లా’ ఫస్ట్ సింగల్‌గా రిలీజ్ అయ్యింది. పాట ఫస్ట్ టైమే ప్లెజంట్‌గా, ఒక నీట్ వైబ్‌తో ఆకట్టుకుంటుంది. రిపీట్స్ లో ఇలాంటి పాటలు మూవీ కి వండర్స్ చేస్తాయ్ స్లో పాయిజన్ లా ఆడీయన్స్ లో గ్రో అయ్యి, అలాగే చిరంజీవి-నయనతార కోసం వాడిన సింపుల్, ఏజ్‌కి తగ్గ కాస్ట్యూమ్స్, సింపుల్ స్టెప్స్‌తో మంచి ఫీల్ క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి మరియు టీం.
ముఖ్యం చిరు ని అనిల్ ప్రెజెంట్ చేసిన స్టైల్ చాలా నీట్ గా ఉంది, అటు డాన్స్ వేయించారు, ఇటు స్టైల్ గాను చూపించగలిగాడు అదీ చాలా ‘నీట్’ గా.
ఇలాంటి లైవ్లీ సాంగ్ ఒక పెద్ద హీరో నుంచి పడి చాలా కాలం అయింది, ఇక ఈ పాట రీల్స్ లో రిలీజ్ దాకా దున్నేయడం ఖాయం లానే ఉంది.







