తెలుగు భాషను “బంగాళా”ఖాతంలో కలపాలనుకున్నారా?

ys jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలుగు భాష ఉచ్ఛారణ పై ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నేతలు పలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ తన తెలుగు భాషతో ఆ విమర్శలకు ఎప్పటికప్పుడు బలం పెంచుతున్నారు. తాజాగా వరద బాధితుల సహాయార్థం ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువుల లిస్ట్ చదవబోతు మళ్ళీ మీడియా కంటికి, ప్రతిపక్ష పార్టీల నోటికి చిక్కారు సీఎం జగన్.

వరద ప్రాంతాలలో ప్రజలను సురక్షితంగా ఉంచడానికి 92 రిలీఫ్ క్యాంపులు పెట్టడం జరిగింది. అలాగే వారికీ అవసరమైన రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు కేజీ, పామాయిలు ఒక లీటర్, ఒక కేజీ ఆనియన్, ఉల్లిగడ్డ ఒక కేజీ అంటూ ప్రకటించగా ఆనియన్ అన్నా ఉల్లిగడ్ద అన్న ఒక్కటే సార్, దానిని పొటాటో..బంగాళా దుంప అంటారు అని అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు జగన్ చెప్పిన తప్పుని సవరించారు.

ADVERTISEMENT

అయితే పొటాటో ని ఉల్లిగడ్డే అంటారుగా అంటూ కాసేపు వారితో వాదించిన జగన్ ఇక బంగాళ దుంపకే ఫిక్స్ అయ్యి బంగాళాదుంప అని పలకడానికి కూడా చాలా కష్టపడ్డారు . ప్రత్యర్థి ఇలా మీడియా సాక్షిగా దొరికితే ఇక ప్రతిపక్షాలు కామ్ గా ఉంటాయా? ఇక ఈ వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అందుకే సీఎం సార్ పాఠశాలలో తెలుగు బోధన తరగతులు కూడా ఉండాలి అనిచెప్పేది. మీరేమో అర్ధం చేసుకోరు మరి అంటూ గతంలో అసెంబ్లీ లో జగన్ చెప్పిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వ్యాఖ్యలకు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు జోడించి మీమర్స్ మీమ్స్ వండి సోషల్ మీడియాలో వడ్డిస్తున్నారు.

భీమవరం వారాహి యాత్రలో భాగంగా జగన్ తెలుగు ఉచ్ఛారణ పై పవన్ చేసిన కామెంట్స్ కూడా దీనికి జత పరుస్తున్నారు జనసేన శ్రేణులు. తెలుగు ఉచ్ఛారణ సరిగా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం చూసిన నేను వచ్చే జనసేన ప్రభుత్వంలో జగన్ కు “జనసేన వయోజన సంచార పాఠశాల పథకం” క్రింద ఒత్తులు, దీర్ఘాలతో కూడిన స్పష్టమైన తెలుగు భాషను నేర్పుదాం. అప్పడైనా వారాహీకి – వరాహికి మధ్య ఉన్న తేడా అర్ధమవుతుంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి “ఆనియన్ – ఉల్లిగడ్డ” మధ్య ఇరుక్కున్న జగన్ ను సామాజిక మాధ్యమాలలో “పొటాటో చిప్స్” మాదిరి ఫ్రై చేస్తున్నారు నెటిజన్లు.ఇలా జగన్ బంగాళాదుంపతో తెలుగు భాషను బంగాళాఖాతంలో కలిపేశారు అంటున్నాయి టీడీపీ సోషల్ మీడియా వర్గీయులు.

ADVERTISEMENT
Latest Stories