కమెడియన్ పృథ్వి ఒక మహిళా ఉద్యోగితో అసభ్య ఫోన్ సంభాషణలో దొరకడంతో ప్రతిష్టాత్మక ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు మిడిసిపడ్డాడు అంటూ ఆయనకు ఆఫర్లు కూడా తగ్గించేశారు. ఇది చాలదు అన్నట్టు … ఆన్ లైన్ లో ట్రోల్ల్స్ ఆయన జీవితాన్ని దుర్భరం చేసేశాయి.
దీనితో ట్రోల్‌లపై నటుడు నిన్న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంతమంది తన బహిరంగ ప్రసంగాల వీడియోల నుండి బిట్స్‌ను ఎడిట్ చేస్తున్నారని మరియు వాటిని టిక్‌టాక్ లో పెట్టి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొందరు అతని ఇమేజ్‌ను కించపరిచేలా మార్ఫింగ్ చేస్తున్నారని కూడా ఆరోపించారు.
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వీడియోలన్నింటినీ తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆయన కోరారు. అలాంటి పరువు నష్టం కలిగించే కొన్ని వీడియోల జాబితాను ఆయన సమర్పించారు. ఇది ఇలా ఉండగా.. తనపై ఉన్న నిందలు తొందరలోనే తొలగిపోతాయని పృథ్వి చెబుతున్నా చాలా మంది ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అంటున్నారు.
2014 ఎన్నికలకు ముందే పృథ్వి వైఎస్సార్ కాంగ్రెస్ కోసం పని చేసారు. గత ఏడాది పృథ్వి వైసిపి పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు. పార్టీ కోసం బాగా పనిచెయ్యడంతో జగన్ దృష్టిలో పడ్డారు. దీనితో వైసిపి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పృథ్వికి ఎస్వీబిసి చైర్మన్ పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే.





