పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా చేస్తా… అది తప్ప..!

Sunil, Comedian Sunil Pawan Kalyan, Comedian Sunil Pawan Kalyan Jana Sena , Comedian Sunil Campaign Jana Sena , Comedian Sunil Campaign Pawan Kalyan Jana Sena , Sunil Campaign Pawan Kalyan Jana Sena , Sunil Campaign Jana Senaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పై సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తమ తమ అభిప్రాయాలను వివిధ సందర్భాలలో వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అయితే పవన్ కు బాగా ప్రీతిపాత్రమైన కమెడియన్ కం హీరో సునీల్, ‘జనసేన’పై ఏమనుకుంటున్నారు? పవన్ నోరు తెరిచి అడిగితే సునీల్ స్పందన ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం లభించింది.

‘పవన్ కళ్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని, తను ఏం చేసినా, ఏం చెప్పినా చాలా నిజాయితీగా చెప్తారని, అందుకే పవన్ తనకు అభిమానం ఎక్కువని’ అభిప్రాయపడ్డారు సునీల్. అయితే 2019 ఎన్నికలలో పవన్ ఎన్నికల బరిలోకి దిగమని చెప్తే… ‘జనసేన’ తరపున ప్రచారం చేయడానికి తానూ వెనుకాడనని, అయితే పోటీ మాత్రం చేయనని చెప్పుకొచ్చారు ఈ ‘అందాల రాముడు.’

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బాధ్యత అప్పజెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటాను గానీ, పోటీ మాత్రం తన వల్ల కాదని, ఆ సమయం ఏదో తనకు వచ్చిన పని మీద పెడితే మంచిదన్న ఉద్దేశమే తప్ప ఇంకేమి లేదని ‘జనసేన’పై తన అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పుకొచ్చారు. సునీల్ కు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు అయిన త్రివిక్రమ్, మరో పక్క పవన్ కు కూడా అదే రకంగా శ్రేయోభిలాషిగా ఉన్న విషయం తెలిసిందే. బహుశా ‘జనసేన’ తరపున సునీల్ కు ఏదైనా బాధ్యత వస్తే… అది పవన్ సలహా మేరకు త్రివిక్రమ్ డైరక్షన్లోనే అని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories