బంపర్ ఆఫర్ కొట్టిన కామెడీ హీరో!

Comedy Hero Sunil with Director Puri Jagannadhసక్సెస్ అన్న పేరు తన దరిన లేకపోయినా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పూరీ జగన్నాధ్ స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ ను హీరోగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్న పూరీ ఖాతాలో బాలయ్య బాబు, మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ రెండు ఎప్పుడు ప్రారంభం అవుతాయనేది ఆయా హీరోల పైన ఆధారపడి ఉంటుంది గానీ, తన తనయుడుతో తెరకెక్కించే “మెహబూబా” సినిమా తర్వాత కామెడీ అవతారం దాల్చిన సునీల్ తో ఓ సినిమా చేయాలని సంకల్పించినట్లుగా ట్రేడ్ టాక్.

ADVERTISEMENT

మరో వైపు హీరోగా అవకాశాలు వస్తున్నా, వాటిని విజయాలుగా మలుచుకోవడంలో విఫలమవుతున్న సునీల్ కు ఇదొక బంపర్ ఆఫర్ లాంటిదేనని చెప్పవచ్చు. పూర్తి స్థాయి వినోదభరితమైన కధగా పూరీ దీనిని మలిచారనేది అసలు న్యూస్. ఇద్దరూ సక్సెస్ కోసం పరితపిస్తుండగా, ప్రస్తుతం ఇద్దరూ వేరే చిత్రాలు చేయడంలో నిమగ్నమయ్యారు. తలపెట్టిన సినిమాలు పూర్తి కాగానే, పూరీ – సునీల్ కాంబో కార్యరూపం సిద్ధించుకుంటుందని, ఈ సినిమాను స్వయంగా తన బ్యానర్ లో నిర్మించాలని పూరీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories