‘జూనియర్ ఎన్టీఆర్’ రిలీజ్ చేసిన ‘ట్రైలర్’ టాక్!

Commando-2-Telugu-Trailerతన స్నేహితుడు విద్యుత్ జమ్మ్వాల్ కు శుభాకాంక్షలు చెప్తూ ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ “కమాండో 2” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ను ‘బుడ్డోడు’ విడుదల చేసారు. ఇండియన్ సినిమాలో హాలీవుడ్ స్థాయి స్టంట్స్ ను రుచి చూపించబోతుందన్న సంకేతాలను “కమాండో 2” ట్రైలర్ వీక్షకులకు పంచింది.

స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యత కలిగిన విద్యుత్ జమ్మ్వాల్ చేసిన స్టంట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. యాక్షన్ ప్రియులను అమితంగా కట్టిపడేసే విధంగా ఉన్న ఈ సినిమా కధ బ్లాక్ మనీ నేపధ్యంలో తెరకెక్కింది. మలేషియా నుండి ఇండియాకు నల్లధనం తెప్పించేందుకు పొలిటిషియన్స్ ఏర్పాటు చేసిన టీంకు, కమాండోకు మధ్య జరిగే పోరాటమే చిత్ర మూలకధ. ఈ ట్రైలర్ అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ “కమాండో 2” మార్చి 3వ తేదీన మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories