మంచు లక్ష్మి ‘తెలుగు భాష’పై కామెంట్!

samantha-manchu-lakshmiమంచు మోహన్ బాబు తనయురాలు లక్ష్మి ప్రసన్న తెలుగు ఉచ్ఛరించే విధానం కర్ణకఠోరంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బహుశా ఆమె మంచు వారి వారసురాలు కాకపోతే… ఈ స్థాయిలో బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేది కాదన్న విషయం అందరూ అంగీకరించేదే. ఈమె తెలుగు ఉచ్చారణపై గతంలో ఎన్నోసార్లు నెటిజన్లు కామెంట్స్ చేయగా, తాజాగా మరొక కీలక కామెంట్ ఆ జాబితాలో చేరింది. అయితే ఇది చేసింది మరెవరో కాదు, స్వయంగా మంచు లక్ష్మినే ఆమె తెలుగు భాషా పరిజ్ఞానం గురించి చెప్పుకుంది.

బుల్లితెరపై ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంచు లక్ష్మి, తాజాగా ‘కుందనపు బొమ్మ’ సమంతను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసింది. ఆ కార్యక్రమం తాజాగా ప్రసారం కాగా, తెలుగులో గలగలమంటూ మాట్లాడుతున్న సమంతను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… ‘నాకు, తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదని, నా కంటే నువ్వే తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు’ అని చెప్పింది. అయితే లక్ష్మి కామెంట్స్ కు చిరునవ్వు నవ్విన సమంత… తనకూ సరిగా రాదని, కష్టపడి మాట్లాడుతున్నానని, ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరింది.

ADVERTISEMENT

అయితే తెలుగు భాషపై తనకున్న పరిజ్ఞానం గురించి మంచు లక్ష్మికి బాగానే అవగాహన ఉన్నట్లుంది. ఇప్పటివరకు ఇతరులు చేసినవి కేవలం విమర్శలు కాదు, అవి నిజాలు అని చెప్పే రీతిలో తన తెలుగు భాషా ప్రావీణ్యం ఉందని మంచు లక్ష్మి చెప్పకనే చెప్పింది. ఎప్పటికైనా మంచు లక్ష్మి తెలుగు ఉచ్చరణను చూసి ‘దేవుడా…’ అనుకోవడం వీక్షకుల వంతు..!

ADVERTISEMENT
Latest Stories