విశాఖలో ఏం జరుగుతుంది? రెండు పక్కల నుండీ ఉపద్రవాలు

Coronavirus cases increased in vizagవిశాఖపట్నం జిల్లాలో నిన్న బ్లాక్ తరస్ డే అనడంలో ఎటువంటి అనుమానము లేదు. నిన్న ఆర్ఆర్ వెంకటాపురం లో ఎల్జీ పొలిమెర్స్ సంస్థలో జరిగిన గ్యాస్ లీక్ కారణంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరిన 554 మందిలో 128 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన వారిలో 52 మంది పిల్లలతో సహా 426 మంది కెజిహెచ్ మరియు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో ఉన్నారు.

నిన్న అర్ధరాత్రి ఉన్నఫళంగా మరో గ్యాస్ లీక్ జరిగిందని పుకార్లు వ్యాపించాయి. పైగా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా అర్ధరాత్రి ఇల్లులు ఖాళీ చేయించడంతో ప్రజలు మరింతగా వణికిపోయారు. దీనితో నిద్ర లేని రాత్రి గడిపారు. చాలా మంది ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి.

ADVERTISEMENT

ఆ షాక్ నుండి కోలుకోక ముందే…. విశాఖలో గురువారం ఒక్క రోజే పదకొండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక రోజులో జిల్లాలో ఇవే అత్యధిక కేసులు. గత 24 గంటలలో రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు అయ్యింది విశాఖపట్నం జిల్లాలోనే. మధ్యలో కొంత కాలం జిల్లాలో కేసులు నమోదు కావడంతో గండం తప్పింది అనే అనుకున్నారు.

అయితే ఈ మధ్య కేసులు పెరిగి గురువారం ఒక్కసారే పదకొండు కేసులు నమోదు అయ్యాయి. దీనితో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 1,887కు చేరింది. ఇక గ్యాస్ లీక్ విషయానికి వస్తే కేంద్రం పంపిన బృందాలు ప్లాంట్ లోని గ్యాస్ ని నిర్వీర్యం చేసే పనిలో ఉ

ADVERTISEMENT
Latest Stories