ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 1097 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 81 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 52 కేసులు కృష్ణ జిల్లాకు చెందినవి, మరో 12 కేసులు పశ్చిమ గోదావరికి చెందినవి. 279 కేసులతో కర్నూలు, 214 కేసులతో గుంటూరు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
177 కేసులతో కృష్ణా జిల్లాలో కూడా ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. కృష్ణా జిల్లాలో కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అందులోనూ… ఆంధ్రప్రదేశ్ లో ఒకానొక అతిపెద్ద నగరమైన విజయవాడలో ఎక్కువ కేసులు ఉండటం కలకలం సృష్టిస్తుంది. విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 100 దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
నగరంలో 80% హాట్ స్పాట్ గా ఉండటం గమనార్హం. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువ కరోనా కేసులు వెలుగుచూసినట్లు తెలిసింది. కృష్ణలంక ప్రాంతాన్ని పోలీసులు పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. 200 మందికి పైగా హోం క్వారంటైన్‌లో ఉంచారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం చికెన్, ఇతర నాన్ వెజ్ కోసం ప్రజలు ఎక్కువగా రోడ్ల మీదకు వస్తుండడంతో అధికారులు ఆదివారం మాంసం దుకాణానాలు మూయించేస్తున్నారు. పరిస్థితులు అదుపులోకి తేవడం ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుందని, ఎవరూ కంగారుపడనవసరం లేదని జిల్లా అధికారులు అంటున్నారు.





