మరో కరోనా ఉపద్రం… మోడీ ప్రభుత్వం అనాలోచిత చర్య వల్లేనా?

Prime Minister Narendra Modi Clueless About Unmounting The Tigerకరోనా కొంత కంట్రోల్ లో ఉందనుకుంటున్న సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన కొన్ని అనాలోచిత చర్యలు ఇప్పుడు కేసులు పెరగడానికి కారణం అయ్యాయా? అంటే అవును అనే అంటున్నారు నిపుణులు. ఈ దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం చాలా సడలింపులు ఇచ్చింది, తాజాగా రైల్వే సర్వీసులు కూడా క్రమేపీ పునరుద్ధరించింది.

ఢిల్లీ … వివిధ రాష్ట్రాల రాజధానుల మధ్య అనేక రైళ్లు నడపడం ప్రారంభించింది. ఈ నిర్ణయం శాపంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకు… మహారాష్ట్రలోని థానే నుండి కర్నూల్ కి స్పెషల్ ట్రైన్ లో 930 మంది వలస కార్మికులు వచ్చారు. అందులో లో 250 మందిని పరీక్షించగా వారిలో 38 మంది పాజిటివ్ గా గుర్తించడం జరిగింది.

ADVERTISEMENT

వీరిలో కర్నూల్ లో 37 మంది మరియు కడప లో ఒక్కళ్ళు పాజిటివ్ గా గుర్తించబడ్డారు.ఈ స్పెషల్ రైళ్ల కారణంగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. టెస్టులు చెయ్యనివారు బయటకు వెళ్లి వైరస్ ని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. ఇది రానున్న రోజులలో మరింత ప్రమాదం కాబోతుంది.

నిన్న ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో చాలా మంది ముఖ్యమంత్రులు రైళ్లను పునరుద్దరించవద్దని మొత్తుకున్నారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా… దేశవ్యాప్తంగా కరోనా కేసులు 70,000కు పైగా ఉన్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories