వ్యాక్సిన్ తీసుకుని 24 గంటలు గడవక ముందే తెలంగాణ లో హెల్త్ వర్కర్ మృతి

COVID-19 - Vaccine Human Trialsనిర్మల్ జిల్లా కుంతల పిహెచ్‌సిలో మంగళవారం కోవిడ్ టీకా తీసుకున్న ఒక 42 ఏళ్ల మగ హెల్త్ వర్కర్ ను ఈరోజు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతను గత రాత్రి ఛాతీ నొప్పి తో ఇబ్బంది పడ్డాడట. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు అతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

అయితే మరణానికి టీకాతో సంబంధం లేదని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయని తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ పేర్కొన్నారు. కరోనా టీకా వేసిన తరువాత మరణం సంభవించడం ఇది భారతదేశంలో మొదటిసారి. మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహిస్తుంది. అప్పుడే మరణానికి కారణాన్ని నిర్ధారించవచ్చు.

ADVERTISEMENT

సంబంధిత విభాగాలు ఈ విషయాన్ని పరిశీలించి కేంద్ర ఏఈఎఫ్ఐ కమిటీకి నివేదికను సమర్పించనున్నాయి. అయితే సంబంధిత వ్యక్తికీ కోవిషీల్డ్ ఇచ్చారా లేదా కోవాక్సిన్ ఇచ్చారా అనేది తెలియదు. టీకా భద్రతపై ఇప్పటికే అనేక అపోహలు ఉన్నాయి.సామాన్యుల సంగతి తరువాత కనీసం హెల్త్ వర్కర్లు కూడా టీకా తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.

ఈ వార్త ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీయవచ్చు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 తో ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న హెల్త్ వర్కర్లకు టీకాలు ఇవ్వడం పూర్తి చేసి ప్రైవేట్ ఆసుపత్రుల హెల్త్ వర్కర్లకు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories