టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నా.. ఇన్నాళ్లు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడు లేదు. మహాకూటమి పేర టీఆర్‌ఎస్ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే పనిలో ఉండడమే దీనికి కారణం. ఒకపక్క టీడీపీ, కోదండరాం పార్టీతో చర్చలు జరుపుతూనే మరోపక్క సొంత పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేసేపనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ.
[m9ad]
ఇది ఇలా ఉండగా మహాకూటమిలో ఉన్న సిపిఐ కూడా కాంగ్రెస్ వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉందట. సీట్ల పంపిణీలో ఉన్న విభేదాలతో పాటు, ఏదైనా కూటమి వల్ల తమకు సరైన ఉపయోగం ఉండటం లేదని ఆ పార్టీ భావమట. పొత్తులో భాగంగా తమ ఓట్లు మిత్రపక్షాలకు పూర్తిగా బదిలీ అవుతున్నా ఆ పార్టీ ఓట్లు తమకు పడట్లేదని వారి బాధ అట.
మరో కమ్యూనిస్టు పార్టీ సిపిఎం అయితే ప్రస్తుతానికి మహాకూటమికి దూరంగా ఉండి, పవన్ కళ్యాణ్ కరుణిస్తారేమో అని ఆశగా చూస్తున్నారు. జనసేన ఇప్పటిదాకా తాము తెలంగాణాలో పోటీ చేస్తామో లేదో కూడా తేల్చి చెప్పలేదు. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీలో తెలుగు రాష్ట్రాలలో తోక పార్టీలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి.





