‘పొన్నియిన్ సెల్వన్’ రెండవసారి చూడొద్దు – తమిళ క్రిటిక్

Ponniyin-Selvan-PS1తమిళ కల్పిత చారిత్రిక చిత్రం పొన్నియిన్ సెల్వన్ నిన్న రిలీజ్ అయ్యి తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంది. తమిళ చోళ రాజుల కాలం నాటి సినిమాని మణిరత్నం భారీ బడ్జెట్ తో తీశారు. విక్రమ్, కార్తీ, జయంరవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్ వంటి హేమా హేమీలు నటించిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. అయిదు రోజుల వరకు తమిళ వెర్షన్ బుకింగ్స్ ఫుల్ అవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ సందర్భంగా ఒక పేరొందిన తమిళ సమీక్షకుడు, తమిళ ప్రేక్షకులను పొన్నియిన్ సెల్వన్ ని రెండవసారి చూడవద్దని అభ్యర్ధించారు. అదేంటి ఎందుకలా అన్నారు? అని మీరు సందేహపడవచ్చు. పొన్నియిన్ సెల్వన్ టికెట్స్ దొరకక చాలా మంది తమిళ ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. తమిళనాడులో అయిదు రోజుల టికెట్స్ అమ్ముడైపోయాయి . ఒకసారి చూసిన వారు వారం వరకు ఆగితే, అసలు ఒక్కసారి కూడా చూడని వారికి టికెట్స్ దొరుకుతాయి.వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారని అందరూ సినిమాని ఒకసారి చూడాలని ఆ సమీక్షకుని ఉద్దేశం. తమిళనాడులో ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఏర్పడటం మణిరత్నంకి కొంత ఊరటనిస్తోంది.

ADVERTISEMENT

తమిళ ప్రజలని బాగా ఆకట్టుకున్న పొన్నియిన్ సెల్వన్, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది.తెలుగులో ఒక మోస్తరు ఓపెనింగ్స్ తో సినిమా నడుస్తుంది. రెండవ పార్ట్ ని వచ్చే సంవత్సరం మార్చ్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories