డియర్ కామ్రేడ్ పెద్ద డ్రాప్స్…. ట్రేడ్ కు చెమటలు!

Dear Comrade -collections droppingవిజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం పోయిన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ ఆశాజనకంగా లేకపోయినా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. అయితే మొదటి రోజు ఉన్న జోష్ రెండో రోజు కనిపించలేదు. అన్ని చోట్లా డ్రాప్స్ తో సినిమా ప్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. సీడెడ్ లో మొదటి రోజు 88 లక్షల షేర్ రాబడితే రెండో రోజు కేవలం 25 లక్షల షేర్ వచ్చింది. సినిమాను ఏకంగా మూడున్నర కోట్లకు కొన్నారు. ఈరోజు ఆదివారం తరువాత పెద్దగా వచ్చేది ఏమీ ఉండదు.

హీనపక్షం రెండు కోట్ల లాస్ తప్పదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ మేరకు షేర్ రాబడితే కనీసం హిట్ అనిపించుకోవచ్చు. ఓపెనింగ్స్ వల్ల ఫుల్ రన్ లో యావరేజ్ అవొచ్చని ట్రేడ్ అంచనా. నాకు సినిమా బిజినెస్ తో పని లేదు, ఎక్సపెరిమెంట్లు చేస్తూ పోతా అని విజయ్ దేవరకొండ మొన్న ఆ మధ్య బహిరంగంగా ప్రకటించాడు. దీనిబట్టి డిస్ట్రిబ్యూటర్లు చూసి సినిమాలు కొంటే వారికే మంచిది.

ADVERTISEMENT

ఏ జోనర్ సినిమాకి ఎంత పెట్టాలి అనే విచక్షణ కోల్పోవడం ఫ్లోప్స్ కు ఎక్కువగా కారణం అవుతుంది. ఒకప్పుడు సక్సెస్ కు చిరునామాగా ఉండే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. గత కొంత కాలంగా ఆ నిర్మాణ సంస్థను పరాజయాలు పలకరిస్తున్నాయి. దీనితో ఆ సంస్థ కూడా ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పుడు విజయం కోసం తమ తదుపరి చిత్రం గ్యాంగ్ లీడర్ కోసం వేచి చూడాల్సిందే. ఈ చిత్రం తరువాత విజ‌య్ దేవ‌ర‌కొండకు హీరో అనే ఒక సినిమా, క్రాంతి మాధవ్ తో ఇంకా పేరు పెట్టని ఒక సినిమా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories