శివాజీ దండోరా సాగుతూనే ఉంది!

Dhandoraa Movie Controversy

సినీ నటుడు శివాజీ సినీ తారల ‘డ్రెస్ సెన్స్’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతున్న ఈ తరుణంలో ఆయన ప్రధాన పాత్ర చేసిన దండోరా సినిమా రిలీజ్ అయ్యింది.

సినిమా రిలీజ్ ముందు ఇటువంటి వివాదాలు ఆ సినిమాకు ‘ఫ్రీ ప్రమోషన్’గాను పని చేస్తాయి. ఒక్కోసారి అవే సినిమాను దెబ్బతీసేస్తాయి కూడా. దండోరా సినిమాపై ఈ ప్రభావం పడుతుందని అనుకున్నప్పటికీ, సినిమా కంటెంట్‌లో బలం, వైవిధ్యం ఉండటంతో ప్రేక్షకులు దండోరాను ఆదరిస్తున్నారు.

ADVERTISEMENT

ఒక విధంగా ఇది దర్శకనిర్మాతల అదృష్టమనే చెప్పాలి. అయినప్పటికీ ఈ వివాదంతో సినిమాను ముడిపెట్టవద్దని శివాజీ మీడియా ద్వారా అందరినీ అభ్యర్థించారు. ఈ సినిమా దెబ్బతింటే అందరూ నన్నే నిందిస్తారు. కనుక అందరూ ‘దండోరా’ని ఆదరించవలసిందిగా శివాజీ విజ్ఞప్తి చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ వివాదం, నా వ్యక్తిగత విషయాల గురించి తర్వాత వేరేగా మాట్లాడుకుందాం. అప్పుడు నేనే వచ్చి మీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాను. ప్రస్తుతం మాత్రం దండోరా గురించే మాట్లాడుకుందాం,” అని అన్నారు.

శివాజీ బేషజాలు పక్కన పెట్టి ప్రేక్షకులను ఈ విధంగా అభ్యర్థించడం మంచిదే. సినిమాను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరం కూడా. కానీ ఎన్ని వివాదాలు చెలరేగినా సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులు సినిమాను తప్పక ఆదరిస్తారని దండోరా మరోసారి నిరూపిస్తోంది. కనుక ఈ వివాదం సంగతి పక్కన పెట్టి చూస్తే, మంచి కథతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని మరోసారి స్పష్టమైంది.

ADVERTISEMENT
Latest Stories