నాగార్జునకు త్రివిక్రమ్ కు ఎక్కడ చెడింది?

Differences between nagarjuna akkineni and trivikram srinivasకింగ్ నాగార్జున మన్మథుడు 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్ కొంత మేర వివాదాస్పదం అవుతుంది. అలాగే పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. నాగార్జున మాట్లాడుతూ మన్మథుడు దర్శకుడు విజయభాస్కర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ఆ సినిమాకు కథ, కథనం, మాటలు అందించిన త్రివిక్రమ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి మన్మథుడు అనే సినిమా త్రివిక్రమ్ సినిమా గానే చాలా మంది చూస్తారు.

ADVERTISEMENT

అలాంటిది త్రివిక్రమ్ గురించి మాట్లాడలేదు అంటే… నాగార్జునకు ఆయనకు ఎక్కడో చెడింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు నాగార్జున అఖిల్ తో ఒక సినిమా తీయమని త్రివిక్రమ్ ను పలుసార్లు అడిగాడని, అయితే త్రివిక్రమ్ దానికి ఒప్పుకోలేదని, అఖిల్ వరుస పరాజయాలకు త్రివిక్రమ్ కూడా ఒక కారణమని నాగార్జున అనుకుంటున్నాడని, అందుకే ఆ దర్శకుడి మీద ఆగ్రహం తో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే మన్మథుడుకి మన్మథుడు 2కి సంబంధం ఏమీ లేదు.

కేవలం పెళ్లి అంటే హీరోకి సదభిప్రాయం లేకపోవడం అనేదే రెండిట్లో కామన్ పాయింట్. ఆగష్టు 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది మన్మథుడు 2. నామమాత్రంగా అనసూయ కథనం సినిమా తో ఆ సినిమాకు బాక్స్ ఆఫీసు వద్ద పోటీ అనేదే లేదు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక ఫ్రెంచ్ సినిమా రీమేక్ మన్మథుడు 2. ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories