అయ్యో పాపం దిల్‌రాజు.. చిరంజీవి జస్ట్ మిస్!

dil-raju with media after meeting with revanth redddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసిన తర్వాత, మీడియా ముందుకు వచ్చినప్పుడు వారి మొహాలలో కళ తప్పింది. పాపం దిల్‌రాజు.. టిడిఎఫ్‌సీ అధ్యక్షుడుగా వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళగలిగారు కానీ తాము కోరుకున్న ఏ ఒక్కటీ సాధించుకోలేకపోయారు. కానీ కనీసం సంక్రాంతి సీజన్లో టికెట్స్ ధరలు పెంచుకునేందుకు కూడా సిఎం నుంచి హామీ పొందలేకపోయారు.

సంక్రాంతికి టికెట్స్ రేట్స్ పెంచుకోవడం అసలు ముఖ్యమైన విషయమే కాదు. సిఎంగారు మాకు అంతకంటే పెద్ద టాస్క్ ఇచ్చారని ‘కర్ర విరగకుండా పాము చావకుండా’ అన్నట్లు చెపుతుంటే సామాన్య ప్రజలు కూడా ‘అయ్యో పాపం’ అని జాలిపడే ఉంటారు. కమిటీలు వేసుకొని సమస్యలని పరిష్కరించుకుంటామని దిల్‌రాజు సర్ది చెప్పుకున్నారు.

ADVERTISEMENT

ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని దిల్‌రాజు చెప్పుకున్నారు కానీ వారే ప్రభుత్వానికి అన్ని విదాల సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి నిఖచ్చిగా చెప్పారు. ఇంకా వారికి అనేక టాస్కులు కూడా ఇచ్చి పూర్తి చేయాలని చెప్పి పంపించారు. కనుక ముందుగా అవన్నీ పూర్తి చేసి విధేయత చాటుకున్నాకనే టాలీవుడ్‌ సమస్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని వేరే చెప్పక్కరలేదు.

దిల్‌రాజు చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేయించినందుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకోగా, జగన్‌ చేతిలో చేదు అనుభవాలను చవి చూసిన చిరంజీవి ఇటువంటిదేదో జరుగుతుందని ముందే పసిగట్టారో ఏమో ఈ సమావేశానికి డుమ్మా కొట్టి మరోసారి అవమానపడకుండా తృటిలో తప్పించుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories