‘బాజీరావు మస్తానీ’ పై షారుక్ ‘దిల్ వాలే’ ఆధిపత్యం!

Dilwale-vs-Bajirao-Mastaniరెండు ప్రతిష్టాత్మక సినిమాలు “బాజీరావు మస్తానీ, దిల్ వాలే” ఒకే రోజు విడుదల కావడంతో ఏ సినిమా కలెక్షన్లు పై చేయి సాధిస్తాయా… అన్న ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. అయితే రెండు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ బరిలో నిలువడం, రెండు సినిమాల జోనర్లు వేర్వేరు కావడం బాలీవుడ్ కు కలిసి వచ్చే అంశం. పబ్లిక్ టాక్ తో విమర్శకులంతా “బాజీరావు మస్తానీ” సినిమాను ఆకాశానికెత్తేయగా, షారుక్ యథావిధిగా తన మార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ‘దిల్ వాలే’ బాట పడుతున్నారు.

అయితే తొలిరోజు వసూళ్లను పరిశీలిస్తే… షారుక్ ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి… షారుక్ రేంజ్ తో రన్వీర్ సింగ్ ను పోల్చడం సరికాదు గానీ, ఆ సినిమా మేకింగ్ మరియు విడుదల సమయం రీత్యా ‘సూపర్ స్టార్’తో తలపడ్డాడు. ఇండియాలో ఫస్ట్ డే, షారుక్ “దిల్ వాలే” 21 కోట్లను కొల్లగొట్టగా, రన్వీర్, దీపిక, ప్రియాంకాల “బాజీరావు మస్తానీ” 12.80 కోట్లు కైవసం చేసుకున్నాడు. దాదాపు 3050 స్క్రీన్లలో ప్రదర్శించిన “బాజీరావు మస్తానీ” సినిమా కారణంగా షారుక్ “దిల్ వాలే”కు ఆశించిన సంఖ్యలో ధియేటర్లు దొరకక పోవడంతో 21 కోట్ల వరకే పరిమితమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే 2015 సంవత్సరం చివరలో వచ్చిన ఈ సినిమాలు బాలీవుడ్ కు కొత్త ఊపిరిని పోసాయి. ఇటీవల విడుదల అవుతున్న పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాస్టర్ అవుతుండడంతో… ఈ రెండు సినిమాలకు లభించిన టాక్ బాలీవుడ్ నిర్మాతలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.

ADVERTISEMENT
Latest Stories