దొంగగా మారనున్న పవన్ కళ్యాణ్

Director Krish period film with pawan kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రావడం ఖాయం అయిపోయింది. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ రీమేక్ లో ఆయన నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. మొన్నే ఆ సినిమా ముహూర్తం కూడా చేసుకుంది. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమానే కాకుండా పవన్ వేరే సినిమా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

గతంలో బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి కి దర్శకత్వం వహించిన క్రిష్ పవన్ తో మరో పీరియడ్ సినిమా చెయ్యబోతున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారట. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇది. మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులు… ఇవ‌న్నీ తెర‌పై చూపించ‌బోతున్నారు. పిరియాడిక్ డ్రామా కోసం భారీ సెట్లు వేయ‌బోతున్నారు.

కాస్ట్యూమ్స్‌, సెట్స్‌, అప్ప‌టి ఆయుధాలూ తయారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన కేరీర్ లో పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి. ఈలోగా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా మొదలు పెడతారు. ఇక పింక్ రీమేక్ విషయానికి వచ్చే సరికి, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా కనిపించబోతున్నారు.

పింక్ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరిలో ఎంటర్ కాబోతున్నారు. 20 రోజులలోనే ఆయన పార్టు మొత్తం పూర్తి అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) కంఫర్మ్ అయ్యారు.

ADVERTISEMENT
Latest Stories