ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘M’achilipatnam నుంచి మా ‘V’జయవాడ నుంచి ‘వి’ ‘GUN’టూర్ నుంచి గన్ కలిపి MAVIGUN అంటూ జగన్ మరోకొత్త రాజధాని ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అలాగే 2029 వైసీపీ ఎన్నికల నినాదం కూడా మావిగన్ అంటూ జగన్ కుండబద్దలు కట్టడంతో వైసీపీ రాజకీయ భవిష్యత్ మావిగన్ నిర్దేశించనుందా అన్న చర్చ మొదలయ్యింది.
అయితే తన ప్రతిపాదనను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళుందుకు కూడా జగన్ మావిగన్ కోసం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ముగ్గురు వైసీపీ నేతలను ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసారా.? అందుకోసమే మావిగన్ ను భుజాన మోసేందుకు మచిలీపట్టణం నుంచి పేర్ని నాని, విజయవాడ నుంచి దేవినేని అవినాష్, గుంటూరు నుంచి అంబటి రాంబాబు ని తెరమీదకు తెచ్చారా.?
ఈ ముగ్గురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్ ని మావిగన్ కోసం బలిపీఠం ఎక్కించేందుకు కూడా సిద్దపడుతున్నారు. మావిగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ ఈ ముగ్గురు నేతలు మీడియా ముందు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు.
అమరావతికి మేము వ్యతిరేకంగా కాదు అంటూనే జగన్ అండ్ కో మావిగన్ ను ప్రచారం చేస్తున్నారు అంటే వైసీపీ అమరావతి ని అవినీతి ఆరోపణలతో సమాధి చెయ్యాలనుకుంటుంది అనేది సుస్పటం. మరి జగన్ తన ప్రకటనలతో ఎప్పటికప్పుడు మావిగన్ ను మీడియాలో చర్చకు ఉంచినట్టే మావిగన్ కోసం ముందుకొస్తున్న ఈ ముగ్గురు నేతలను కూడా లైం లైట్ లో ఉంచుతున్నారు.
వైసీపీ లో ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ మావిగన్ కోసం పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ నే జగన్ ఎంచుకున్నారా.? పేర్ని తన వాదనలతో మచిలీపట్టణం ఓటర్లను వైసీపీ వైపుకి ఆకర్షించగలేరని జగన్ నమ్ముతున్నారా.? అలాగే దేవినేని ప్రసంగాలు విజయవాడ ప్రజలను వైసీపీ కి దగ్గర చేయగలవని విశ్వసిస్తున్నారా.? ఇక అంబటి వాక్చాతుర్యం వైసీపీ కి పూర్వవైభవం తీసుకురాగలదనే ధీమాను కనపరుస్తున్నారా.?
ఏపీ రాజధానిగా అమరావతి అనేది ఎవరు మార్చలేని వాస్తవం. మరి రాష్ట్ర రాజధానిగా మావిగన్ అనేది జగన్ సృష్టించిన ఒక కల్పిత గాధ. ప్రజలు వాస్తవాన్ని విడిచి కల్పితం వైపు అడుగులేస్తారు అనుకోవడం జగన్ అవివేకమే అవుతుంది, అలాగే ఈ అంశంలో జగన్ ను గుడ్డిగా అనుసరించడం ఆ పార్టీ నేతల పిచ్చి చర్యగానే భావించాలి.






