ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి చేయబోయే సినిమా గోపీచంద్ తో కంఫర్మ్ అయ్యింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
దీంతో ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ – బన్నీవాసు – మారుతి కాంబినేషన్ సెట్ అయింది. గతంలో ఈ బ్యానర్స్ ద్వారానే మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. మరోవైపు… ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన జోలీ ఎల్ఎల్బీ 2 యొక్క అధికారిక రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
దానికి హింట్ ఇచ్చారా అన్నట్టు అనౌన్స్మెంట్ వీడియో లో కూడా ఒక కోర్ట్ సెట్ అప్ ఉండటం విశేషం. ఈ వీడియోకి ప్రముఖ నటుడు రావురమేశ్ గారి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొసమెరుపు. బహుశా సినిమాలో జడ్జి పాత్ర లో ఆయన నటించే అవకాశం ఉంది. పెద్దగా సక్సెస్ లేకుండా ఢీలా పడిపోయిన గోపీచంద్ కెరీర్ కి మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది అనే చెప్పుకోవాలి.
ఒకరకంగా ఇది అతని కేరీర్ కే బిగ్గెస్ట్ బ్రేక్ అని చెప్పుకోవాలి. మేకింగ్ నుండి పుబ్లిసిటీ వరకు ఫుల్ గా కేర్ తీసుకునే టీం దొరికినట్టు అయ్యింది. 20 కోట్లు బడ్జెట్ లోపు పూర్తి చేసి సేఫ్ గేమ్ ప్లే చెయ్యాలని ప్లాన్ చేస్తుందట చిత్ర బృందం. దీనికి సంబంధించిన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో అధికారికంగా విడుదల అవ్వబోతున్నాయి.





