రాజమౌళి… అన్నింటికీ అర్హుడే..!

Director-Rajamouli-farm house in hyderabad outskirts‘బాహుబలి 2’ సాధించిన అపూర్వ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిన రాజమౌళి అన్న పేరు పరిపూర్ణ ‘బ్రాండ్’గా మారిపోయింది. భారతీయ సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ‘జక్కన్న’కు సంబంధించిన ఓ వ్యక్తిగత సమాచారాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. దాదాపుగా అయిదేళ్ళ పాటు నిర్విరామ కృషితో పూర్తి చేసిన ‘బాహుబలి 2’ విడుదల తర్వాత రిలాక్స్ కోసం విదేశీ టూర్లు వెళ్లోచ్చిన రాజమౌళి అండ్ కో, ఇకపై విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఫాం హౌస్ ను నిర్మించబోతున్నాడట.

ADVERTISEMENT

అవును… ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. హైదరాబాద్ కు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే కొనుగోలు చేసిన 100 ఎకరాల భూమిలో ఈ ఫాం హౌస్ ను నిర్మించబోతున్నట్లుగా సదరు కధనం సారాంశం. అత్యాధునిక హంగులతో పాటు అన్ని రకాల మొక్కలను మరియు కొంత స్థలంలో వ్యవసాయం చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక నుండి షూటింగ్ నుండి విరామం పొందిన సమయాల్లో విదేశాలకు వెళ్ళకుండా… ఈ ఫాం హౌస్ లో సేద తీరే విధంగా తన అభిరుచికి తగిన విధంగా జక్కన్న సమకూర్చుకుంటున్నట్లుగా సమాచారం.

సిల్వర్ స్క్రీన్ పై మెరిసే సినిమాకే అద్భుతమైన సెట్స్ ను డిజైన్ చేయించిన రాజమౌళి, రియల్ లైఫ్ లో అనుభవించబోయే సొంత ఫాం హౌస్ కోసం ఇంకెలాంటి డిజైన్లను సిద్ధం చేస్తారో అన్న టాక్ ప్రధానంగా హల్చల్ చేస్తోంది. ‘బాహుబలి 2’ తర్వాత ఈ ఫాం హౌస్ తెరపైకి రావడంతో… ఈ సినిమా ద్వారా జక్కన్నకు బాగానే గిట్టుబాటు అయ్యాయనే ప్రచారం కూడా బలంగా సాగుతోంది. అయితే ఎంత దక్కినా కూడా… వాటికి రాజమౌళి అర్హుడే అన్న విషయం అందరూ అంగీకరించే అంశమే.

ADVERTISEMENT
Latest Stories